Electricity Charges : తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం పండుగల వేళ ప్రజలకు శుభవార్త అందించాల్సింది పోయి, విద్యుత్ ఛార్జీల పెంపుతో గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్రంగా విమర్శించారు.
దసరా, దీపావళి వంటి ప్రధాన పండుగల సమయంలో ప్రజలకు ఉపశమనం కలిగించాల్సింది పోయి, రేవంత్ రెడ్డి సర్కార్ రూ.5,420 కోట్ల అదనపు విద్యుత్ భారాన్ని ప్రజలపై మోపేందుకు సిద్ధమవడం దారుణమన్నారు. కరువు పరిస్థితులు, పెరిగిన నిత్యవసర ధరలతో ఇప్పటికే సతమతమవుతున్న సామాన్యుల నడ్డి విరిచేలా ఈ నిర్ణయం ఉందని ఆయన మండిపడ్డారు.
మాజీ మావోయిస్టులకు కవిత ఆహ్వానం.. పార్టీలోకి రావాలని పిలుపు
ప్రజలపై విద్యుత్ భారాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలి: బీఆర్ఎస్ డిమాండ్
రాష్ట్రంలో ఎల్ నినో పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందుల వల్ల సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఇబ్బందులు పడుతుంటే, ప్రభుత్వం ఇలాంటి భారం మోపడం తీవ్ర విచారకరమని హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదించిన ఈ విద్యుత్ ఛార్జీల పెంపు నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని, ప్రజలపై ఎలాంటి అదనపు భారం పడకుండా చూడాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున ఆయన గట్టిగా డిమాండ్ చేశారు. ప్రజల ప్రయోజనాలను విస్మరిస్తే విపక్షంగా వీధుల్లోకి వచ్చి పోరాడతామని ఆయన హెచ్చరించారు.

