Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ప్రకాశ్ రాజ్ వీడియో పోస్ట్‌కు బండ్ల గణేశ్ కౌంటర్

ప్రకాశ్ రాజ్ వీడియో పోస్ట్‌కు బండ్ల గణేశ్ కౌంటర్

వార్త 3 weeks ago

Bandla Ganesh: టాలీవుడ్ ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్, నిర్మాత బండ్ల గణేశ్ మధ్య సోషల్ మీడియా వేదికగా మాటల యుద్ధం ముదిరింది. తనపై వస్తున్న విమర్శలకు సమాధానమిస్తూ ప్రకాశ్ రాజ్ పోస్ట్ చేసిన ఒక వీడియోపై బండ్ల గణేశ్ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు.

ప్రకాశ్ రాజ్ మాటల్లో ఎలాంటి నిజాయతీ లేదని, అవన్నీ ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ ప్రకారం చెబుతున్నట్లుగా ఉన్నాయంటూ ఎద్దేవా చేశారు.

‘డబ్బింగ్ డైలాగులు వద్దు.. నిజాయతీ కావాలి’

సోషల్ మీడియా వేదికగా ప్రకాశ్ రాజ్‌ను ఉద్దేశిస్తూ బండ్ల గణేశ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “ఎవరితోనో ట్వీట్లు రాయించుకుని వచ్చి ఇక్కడ పోస్ట్ చేయడం కాదు. కెమెరా ముందు మాట్లాడటం అంటే సినిమాల్లో రాసిచ్చిన డైలాగులను తెలుగులో డబ్బింగ్ చెప్పినట్లు కాదు. ప్రజలతో మాట్లాడేటప్పుడు ఆ మాట హృదయం లోతుల్లోంచి రావాలి, అప్పుడే జనం నమ్ముతారు. ప్రజల మనసులను గెలవడానికి కావాల్సింది స్క్రిప్టులు కాదు.. నిజాయతీ, తమ్ముడూ!” అంటూ చురకలు అంటించారు.

Bandla Ganesh: ‘పైసా కొట్టు.. డైలాగ్ పట్టు’: కర్ణాటక ప్రకాశ్ రాజ్ అంటూ వ్యంగ్యాస్త్రాలు

అంతటితో ఆగని బండ్ల గణేశ్.. ప్రకాశ్ రాజ్‌పై మరో వ్యంగ్య పోస్ట్ పెట్టారు. “పైసా కొట్టు… డైలాగ్ పట్టు! ప్రకాశ్ రాయ్ అలియాస్ ప్రకాశ్ రాజ్, ఫ్రమ్: కర్ణాటక” అంటూ ఆయన పుట్టిన ఊరిని ప్రస్తావిస్తూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

అంతకుముందు ప్రకాశ్ రాజ్ తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో.. “ప్రశ్నించే గొంతుల మీద తప్పుడు ప్రచారం చేస్తున్న వాళ్ళకి నా సమాధానం” అనే క్యాప్షన్‌తో ఓ వీడియోను పంచుకున్నారు. తనపై వస్తున్న ఆరోపణలను తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. అయితే ఈ వీడియోపై బండ్ల గణేశ్ రియాక్ట్ అయిన విధానం ప్రస్తుతం ఫిల్మ్ నగర్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha