Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ప్రకాశ్ రాజ్‌కు ఆర్‌జీవీ మద్దతు.. ఆసక్తికరంగా మారిన వర్మ ట్వీట్!

ప్రకాశ్ రాజ్‌కు ఆర్‌జీవీ మద్దతు.. ఆసక్తికరంగా మారిన వర్మ ట్వీట్!

వార్త 6 days ago

RGV Supports Prakash Raj: జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు, వర్సటైల్ యాక్టర్ ప్రకాశ్ రాజ్ మధ్య ఎక్స్ (ట్విట్టర్) వేదికగా నడుస్తున్న తీవ్రమైన వాదోపవాదాలు తెలుగు రాష్ట్రాల రాజకీయ, సినీ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి.

ఈ ఇద్దరి మధ్య నడుస్తున్న మాటల యుద్ధంలోకి వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఊహించని విధంగా ఎంట్రీ ఇచ్చి, తనదైన శైలిలో స్పందించడంతో ఈ వివాదం సరికొత్త మలుపు తిరిగింది.

‘ప్రశ్నించకుండా లీడర్‌ను ఫాలో అవ్వండి’.. వివాదానికి తెరతీసిన నాగబాబు పోస్ట్

జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నిర్ణయాలను తప్పుపట్టకుండా, ఎలాంటి అనుమానాలు పెట్టుకోకుండా, మౌనంగా ఆయన మార్గాన్ని అనుసరించాలంటూ పార్టీ శ్రేణులకు, అభిమానులకు నాగబాబు పిలుపునిచ్చారు. నాయకుడి మాటే శిరోధార్యమని, ఏది మంచో ఏది కాదో ఆయనకు మాత్రమే తెలుసనే అర్థం వచ్చేలా నాగబాబు చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి.

Read also: Trisha Marriage Rumors: త్రిష మెడలో కేరళ మంగళసూత్రం.. రహస్యంగా పెళ్లి పీటలెక్కిన సౌత్ స్టార్?

RGV Supports Prakash Raj: ‘మేమేం గొర్రెలం కాదు’.. మెగా బ్రదర్‌కు ప్రకాశ్ రాజ్ ఘాటు కౌంటర్

నాగబాబు చేసిన వ్యాఖ్యలపై నటుడు ప్రకాశ్ రాజ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ట్విట్టర్‌లో ఘాటుగా స్పందించారు. “ప్రశ్నలు వేయకుండా, నోరు మూసుకుని మౌనంగా నాయకుడిని అనుసరించమనడంలో మీ ఉద్దేశం ఏంటి నాగబాబు గారు? బానిస బతుకులు బతకడానికి, నోరు మూసుకోవడానికి మేమేం గొర్రెలం కాదు” అంటూ మండిపడ్డారు. ఇలాంటి బెదిరింపు ధోరణులు ప్రజాస్వామ్యంలో ఆమోదయోగ్యం కాదని, ప్రజలు అడిగే ప్రశ్నలకు నాయకులు కచ్చితంగా జవాబుదారీగా ఉండాలని ప్రకాశ్ రాజ్ స్పష్టం చేశారు.

ప్రకాశ్ రాజ్‌కు ఆర్జీవీ సపోర్ట్

ఈ నేపథ్యంలో, నాగబాబు వ్యాఖ్యలను తప్పుబడుతూ ప్రకాశ్ రాజ్ లేవనెత్తిన పాయింట్‌కు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (RGV) మద్దతుగా నిలిచారు. ప్రకాశ్ రాజ్ ట్వీట్‌ను సమర్థిస్తూ ఆర్జీవీ మరింత ఘాటుగా స్పందించారు. “ప్రజాస్వామ్యంలో ఒక నాయకుడికి ప్రజలు నమ్మకంతో బాధ్యతలు అప్పగిస్తారు. అంతేగానీ రాజుగా కిరీటం పెట్టరు” అంటూ సంచలనచేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

పెద్ది బాక్సాఫీస్ రికార్డ్.. 3 రోజుల్లోనే రూ.236.7 కోట్ల వసూళ్లు!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha