Hema: జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను లక్ష్యంగా చేసుకుని ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ సోషల్ మీడియాలో చేసిన వివాదాస్పద పోస్ట్‌పై నటి హేమ తీవ్రంగా మండిపడ్డారు.
రాజకీయ వ్యూహాలను, విధానాలను విమర్శించడంలో తప్పులేదని.. కానీ ఒక వ్యక్తి గౌరవానికి భంగం కలిగించేలా, వ్యక్తిత్వ హననానికి (Character Assassination) పాల్పడటం ఎంతమాత్రం సరికాదని ఆమె హితవు పలికారు. ఈ మేరకు హేమ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పంచుకున్న ఒక వీడియో సందేశం ప్రస్తుతం నెట్టింట విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
HemaInstagramVideo
Read also: Mega 158 movie: శరవేగంగా సాగుతున్న 'మెగా 158' షూటింగ్
'దొర' అంటూ ప్రకాశ్ రాజ్ వ్యంగ్య పోస్ట్.. అసలు వివాదం ఏంటి?
తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థులు బరిలోకి దిగుతారని పవన్ కల్యాణ్ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ రాజకీయ పరిణామంపై ప్రకాశ్ రాజ్ 'ఎక్స్' (ట్విట్టర్) ఖాతాలో వ్యంగ్యంగా స్పందించారు. "రండి దొర… మీరొస్తానంటే మేమొద్దంటామా?" అని రాస్తూ, పవన్ ఈ ఎన్నికల్లో ఒంటరి పోరాటం చేస్తారా లేక ఎవరితోనైనా చేతులు కలుపుతారా అంటూ ప్రశ్నించారు. ఈ పోస్ట్‌లో పవన్ కల్యాణ్ పేరును నేరుగా రాయకపోయినప్పటికీ, ఆయనను ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేశారని అర్థమవుతోంది. ముఖ్యంగా పవన్‌ను ఉద్దేశించి 'దొర' అనే పదాన్ని ఉపయోగించడంపై మెగా అభిమానులు, జనసైనికులు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
Hema: గతంలో విమర్శించిన వారి గతి ఏమైందో చూసుకోండి: హేమ కౌంటర్
ఈ సోషల్ మీడియా వార్‌పై స్పందించిన నటి హేమ.. ప్రకాశ్ రాజ్ వైఖరిని తప్పుపట్టారు. "పవన్ కల్యాణ్ ఎలాంటి వారో, ఆయన వ్యక్తిత్వం ఎలాంటిదో ప్రపంచం మొత్తానికి తెలుసు. కోట్లాది మంది అభిమానులు ఆయన్ను ఎంతగానో ప్రేమిస్తారు. రాజకీయాల పరంగా ఏవైనా విభేదాలు ఉంటే వాటిపై మాట్లాడండి.. అంతేగానీ ఒకరి వ్యక్తిగత ప్రతిష్టను మసకబార్చే ప్రయత్నం చేయకండి" అని హేమ స్పష్టం చేశారు. అంతేకాకుండా, గతంలో పవన్ కల్యాణ్‌ను ఇలాగే వ్యక్తిగతంగా దూషించిన వారికి ఎలాంటి పరిస్థితి ఎదురైందో చరిత్ర తిరగేసి చూసుకోవాలంటూ ఆమె ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రకాశ్ రాజ్ చేసిన ఈ పోస్ట్ తన మనసును ఎంతో గాయపరిచిందని హేమ ఆవేదన వ్యక్తం చేశారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read also:

