Dailyhunt
ప్రపంచ దేశాలను వణికిస్తున్న Mythos AI కొత్త టెక్నాలజీ

ప్రపంచ దేశాలను వణికిస్తున్న Mythos AI కొత్త టెక్నాలజీ

వార్త 1 week ago

ర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో రోజుకో కొత్త ఆవిష్కరణ వస్తోంది. అయితే, ఆంథ్రోపిక్ (Anthropic) సంస్థ తాజాగా తీసుకొచ్చిన మిథోస్ ఏఐ (Mythos AI) ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతోంది.

ఇది కేవలం ఒక చాట్ బాట్ మాత్రమే కాదు, సైబర్ సెక్యూరిటీ వ్యవస్థలనే ఛేదించగల అద్భుతమైన, అదే సమయంలో ప్రమాదకరమైన సామర్థ్యం కలిగిన టెక్నాలజీ. దీని అసాధారణ తెలివితేటలు చూసి ప్రభుత్వాలు సైతం వణికిపోతున్నాయి.

Read Also: Iran pakistan : పాకిస్థాన్ మధ్యవర్తిత్వంపై ఇరాన్ ఫైర్… ఉద్రిక్తతలు పెరుగుతున్నాయా

 Artificial Intelligence

Artificial Intelligence: భారత బ్యాంకింగ్ రంగంపై ప్రభావం

మిథోస్ ఏఐ ఎందుకు ఇంత పవర్ ఫుల్? క్లాడ్ ఏఐ ఫ్యామిలీలో వచ్చిన లేటెస్ట్ మోడల్ ఈ మిథోస్ దీని ప్రత్యేకత ఏంటంటే, కంప్యూటర్ సాఫ్ట్‌వేర్‌లలో దశాబ్దాలుగా ఎవరికీ దొరకని లోపాలను (Vulnerabilities) ఇది సెకన్ల వ్యవధిలో గుర్తించగలదు. మనుషులు నెలల తరబడి చేసే రీసెర్చ్‌ను ఇది చిటికెలో పూర్తి చేస్తుంది. ఆ లోపాలను సరిచేయడమే కాకుండా, వాటిని ఉపయోగించుకుని వ్యవస్థలపై దాడులు కూడా చేయగలదు. భారత బ్యాంకింగ్ రంగంపై ప్రభావం భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ అంశంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. మిథోస్ ఏఐ వల్ల బ్యాంకింగ్ సెక్యూరిటీకి ముప్పు వాటిల్లే అవకాశం ఉందని, బ్యాంకులన్నీ హై అలర్ట్‌లో ఉండాలని ఆమె సూచించారు. ఐటీ శాఖ ఇప్పటికే ఒక నిపుణుల కమిటీని వేసి, ఇలాంటి పవర్ ఫుల్ ఏఐల నుండి మన డేటాను ఎలా కాపాడుకోవాలో చర్చిస్తోంది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

మళ్లీ 2 శాతం పెరిగిన క్రూడాయిల్ ధర

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha