Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ప్రపంచ రికార్డు.. టీ20ల్లో అత్యధిక క్యాచ్‌లు అందుకున్న తిలక్‌ వర్మ

ప్రపంచ రికార్డు.. టీ20ల్లో అత్యధిక క్యాచ్‌లు అందుకున్న తిలక్‌ వర్మ

వార్త 4 hrs ago

Tilak Varma: భారత టీ20 జట్టు వైస్ కెప్టెన్, ప్రతిభావంతుడైన యంగ్ బ్యాటర్ తిలక్ వర్మ అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అరుదైన ప్రపంచ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.

ఒకే క్యాలెండర్ ఏడాదిలో అత్యధిక క్యాచ్‌లు అందుకున్న ఫీల్డర్‌గా నిలిచి చరిత్ర సృష్టించాడు. న్యూజిలాండ్‌తో శనివారం హాగ్లీ ఓవల్‌లో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో రెండు అద్భుతమైన క్యాచ్‌లు పట్టడం ద్వారా తిలక్ వర్మ ఈ ఘనత సాధించాడు.

India vs New Zealand 2nd T20I: రెండో టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా

 World record.. Tilak Varma takes the most catches in T20s

Tilak Varma: డానిల్సన్ హవోయే రికార్డును అధిగమించిన తిలక్

ఈ మ్యాచ్‌కు ముందు ప్రపంచ రికార్డును సమం చేసేందుకు తిలక్‌కు రెండు క్యాచ్‌లు అవసరమవగా, అతడు రెండూ పట్టి అగ్రస్థానానికి చేరుకున్నాడు. దీంతో ఇండోనేషియా ఆటగాడు డానిల్సన్ హవోయే పేరిట ఉన్న రికార్డు తుడిచిపెట్టుకుపోయింది. తిలక్ వర్మ ఏకంగా 30 ఇన్నింగ్స్‌ల్లో 26 క్యాచ్‌లు అందుకోగా, 2025లో హవోయే 25 క్యాచ్‌లు పట్టిన రికార్డు రెండో స్థానానికి పరిమితమైంది.

రెండో టీ20లో న్యూజిలాండ్ కీలక బ్యాటర్లు టిమ్ సీఫెర్ట్, డారిల్ మిచెల్‌లను పెవిలియన్‌కు పంపడంలో తిలక్ వర్మ ఫీల్డింగ్ ఎంతగానో ఉపయోగపడింది. అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌లో సీఫెర్ట్ కొట్టిన భారీ షాట్‌ను కవర్స్ ప్రాంతంలో తిలక్ సులభంగా క్యాచ్ పట్టాడు. ఆ తర్వాత సుదీర్ఘ విరామం అనంతరం భారత జట్టులోకి రీ-ఎంట్రీ ఇచ్చిన భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో డారిల్ మిచెల్ ఇచ్చిన క్యాచ్‌ను వెనక్కి పరిగెడుతూ అద్భుతంగా అందుకున్నాడు. ఇది భువనేశ్వర్‌కు పునరాగమనంలో తొలి వికెట్‌గా నిలవడం విశేషం.

క్యాలెండర్ ఏడాదిలో అత్యధిక క్యాచ్‌లు పట్టిన టాప్ ఫీల్డర్లు

ఒకే ఏడాదిలో అత్యధిక టీ20 క్యాచ్‌లు పట్టిన ఫీల్డర్ల జాబితాలో ప్రస్తుతం తిలక్ వర్మ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు:

ఆటగాడుదేశంక్యాచ్‌లుసంవత్సరం
తిలక్ వర్మభారత్262026
డానిల్సన్ హవోయేఇండోనేషియా252025
మహమ్మద్ వసీమ్యూఏఈ242024
షార్విన్ మునియాండిమలేసియా212025
బ్రియాన్ మసాబాఉగాండా202023
తంజిద్ హసన్బంగ్లాదేశ్202025

అద్భుత ఫీల్డింగ్ సగటుతో తిలక్ జోరు

తిలక్ వర్మ ఒక ఇన్నింగ్స్‌కు సగటున 0.866 క్యాచ్‌లు అందుకుంటూ మైదానంలో తన అసాధారణ ఫీల్డింగ్ సామర్థ్యాన్ని చాటుకున్నాడు. కేవలం 30 ఇన్నింగ్స్‌ల్లోనే 26 క్యాచ్‌లు పట్టడం మైదానంలో అతని చురుకుదనానికి, క్రమశిక్షణకు నిదర్శనంగా నిలుస్తోంది.

Epaper: epaper.vaartha.com

కివీస్‌ 180/5.. భారత్‌ విజయ లక్ష్యం 181 పరుగులు!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha