PM Modi in Sweden: ప్రధాని నరేంద్ర మోదీ తన ఐదు దేశాల పర్యటనలో భాగంగా స్వీడన్‌లో జరిపిన పర్యటన దౌత్య, ఆర్థిక పరంగా వ్యూహాత్మక ప్రాధాన్యతను సంతరించుకుంది.
గోథెన్‌బర్గ్‌లో వోల్వో గ్రూప్ నిర్వహించిన యూరోపియన్ సీఈఓ రౌండ్ టేబుల్ సమావేశంలో స్వీడన్ ప్రధాని ఉల్ఫ్ క్రిస్టెర్సన్, ఈయూ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లేయన్‌లతో కలిసి ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సరఫరా గొలుసు వ్యవస్థలు ఒత్తిడిని ఎదుర్కొంటున్న తరుణంలో, స్థిరమైన ప్రగతి కోసం భారత్-యూరప్ దేశాలు మరింతగా పటిష్ట భాగస్వామ్యాన్ని పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. భారతదేశం నేడు ప్రపంచంలోనే మూడో అతిపెద్ద స్టార్టప్ హబ్‌గా ఎదిగిందని, స్పేస్, ఐటీ, ఏఐ, ఫిన్‌టెక్ రంగాల్లో మన యువత అంతర్జాతీయ సమస్యలకు అద్భుతమైన పరిష్కారాలను చూపుతున్నారని కొనియాడారు.
Read Also :India- Sweden : స్వీడన్ తో ప్రధాని మోడీ కీలక ఒప్పందాలు
PM Modi in Sweden: 31వ అంతర్జాతీయ పురస్కారం సొంతం

భారతదేశంలో గత 12 ఏళ్లుగా సాగుతున్న ‘రిఫార్మ్, పెర్ఫార్మ్, ట్రాన్స్‌ఫార్మ్’ విధానాల వల్ల ఆర్థిక వ్యవస్థ వేగంగా వృద్ధి చెందుతోందని, యూరోపియన్ ఇన్వెస్టర్లు భారతదేశ అభివృద్ధి ప్రస్థానంలో భాగస్వాములు కావాలని మోదీ ఆహ్వానించారు. భారత్-ఈయూ ఉచిత వాణిజ్య ఒప్పందాన్ని (FTA) వీలైనంత త్వరగా ముగించడానికి ఇరుపక్షాలు కట్టుబడి ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. కాగా, ఈ పర్యటనలో ప్రధాని మోదీకి స్వీడన్ ప్రభుత్వం తమ దేశపు అత్యున్నత పురస్కారమైన ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్ కమాండర్ గ్రాండ్ క్రాస్’ ను అందించి గౌరవించింది. మోదీకి ఒక విదేశీ దేశం అందించిన 31వ అంతర్జాతీయ గౌరవం ఇది. స్వీడన్ పర్యటన ముగించుకుని ప్రధాని మోదీ మే 18న తన తదుపరి పర్యటన నిమిత్తం నార్వేకు బయలుదేరనున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

