Jagan : ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వ పాలనలో అరాచకం పరాకాష్ఠకు చేరిందని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
పార్టీ నాయకులు, కార్యకర్తల వరుస అరెస్టులను తీవ్రంగా ఖండిస్తూ ఆయన సోషల్ మీడియా వేదికగా (X) ప్రభుత్వంపై విమర్శల బాణాలు సంధించారు. రాష్ట్రంలో నారాసుర పాలన సాగుతోందని దుయ్యబట్టారు. దాడి చేసిన వారికి ముఖ్యమంత్రి చంద్రబాబు రక్షణ కల్పిస్తూ, దాడులకు గురైన బాధితులపైనే అక్రమ కేసులు బనాయిస్తూ రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని జగన్ తీవ్రంగా ఆరోపించారు.

‘ఎన్ని కేసులు పెట్టినా వెనక్కి తగ్గం’: వైఎస్సార్‌సీపీ అధినేత హెచ్చరిక
“ప్రభుత్వ వైఫల్యాలను, అన్యాయాలను ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తారా? రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్యం ఉందా?” అంటూ వైఎస్ జగన్ నిలదీశారు. పోలీసు వ్యవస్థను రాజకీయ స్వార్థం కోసం వాడుకుంటూ ప్రతిపక్ష గొంతు నొక్కేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. అయితే, కూటమి ప్రభుత్వం ఎన్ని అక్రమ కేసులు పెట్టినా తమ పార్టీ వెనక్కి తగ్గేదే లేదని స్పష్టం చేశారు. ప్రజాసమస్యలపై నిలదీస్తూ, ప్రభుత్వ అరాచకాలపై రాజీలేని పోరాటం చేస్తామని, వైఎస్సార్‌సీపీ శ్రేణులకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని ఈ సందర్భంగా జగన్ పేర్కొన్నారు.
వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షిని అరెస్ట్..కోర్టులో హాజరుపరిచిన పోలీసులు

