Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ప్రతి రైతుకు భూధార్ కార్డులు - మంత్రి పొంగులేటి

ప్రతి రైతుకు భూధార్ కార్డులు - మంత్రి పొంగులేటి

వార్త 0 months ago

Rythu Ashirvada Sabha : చింతకాని మండలం మత్కేపల్లి క్రాస్రోడ్స్ వేదికగా నిర్వహించిన 'రైతు ఆశీర్వాద సభ'లో రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

ప్రస్తుత ప్రభుత్వం ప్రజా సంక్షేమమే పరమావధిగా పనిచేస్తోందని, ప్రతిష్టాత్మక పథకాలను అర్హులైన ప్రతి ఇంటికీ చేరవేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ వారికి వడ్డీ లేని రుణాలను అందిస్తున్నామని, అలాగే నిరుద్యోగుల కలలను సాకారం చేస్తూ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను కూడా వేగవంతం చేశామని ఈ సందర్భంగా మంత్రి గుర్తుచేశారు. ప్రభుత్వ లబ్ధి నేరుగా ప్రజలకే అందేలా పారదర్శక పాలన అందిస్తున్నామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

భూ భారతి సర్వే అనంతరం ‘భూధార్’ పంపిణీ

రైతుల భూములకు పూర్తి భద్రత కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. ఇందులో భాగంగానే ముందుగా ‘భూ భారతి’ సర్వేను విజయవంతంగా పూర్తి చేస్తామని, ఆ తర్వాత ప్రతి గ్రామంలో క్షేత్రస్థాయిలో సమగ్ర భూముల సర్వేను నిర్వహిస్తామని తెలిపారు. ఈ ప్రక్రియ ముగిసిన అనంతరం అర్హులైన ప్రతి రైతుకూ అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘భూధార్’ (Bhoodhaard) కార్డులను అందజేస్తామని మంత్రి వెల్లడించారు. ఈ కార్డుల ద్వారా భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని, రైతులకు తమ భూములపై పూర్తి హక్కులు మరియు రక్షణ చేకూరుతుందని ఆయన ఈ సభ ద్వారా రైతులకు భరోసా ఇచ్చారు.

ఎస్ ఐ ఆర్ ప్రక్రియను నిర్దేశిత గడువు లోపు పూర్తి చేయాలి:కలెక్టర్ ప్రతిమాసింగ్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha