IND vs ZIM: జింబాబ్వే మహిళలతో మూడు వన్డేల సిరీస్‌ను భారత్ ఘనంగా ఆరంభించింది. వడోదర వేదికగా జరిగిన తొలి వన్డేలో 9 వికెట్ల తేడాతో జింబాబ్వేను భారత్ చిత్తు చేసింది.
. ఈ గెలుపుతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో టీమిండియా 1-0 తేడాతో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
Amit Mishra: కోహ్లీ, కుంబ్లే మాట ఇచ్చి తప్పుకున్నారా? కెరీర్ ముగింపుపై స్పిన్నర్ ఆవేదన
కుప్పకూలిన జింబాబ్వే
టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకున్న భారత జట్టు, ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే కట్టడి చేసింది. జింబాబ్వే బ్యాటర్లలో బిలోవెడ్ బిజా (62 పరుగులు) మినహా మిగతావారంతా తక్కువ స్కోర్లకే పెవిలియన్ చేరడంతో ఆ జట్టు నిర్ణీత 49.5 ఓవర్లలో 197 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో లెఫ్టార్మ్ స్పిన్నర్ శ్రీ చరణి అద్భుతమైన ప్రదర్శనతో (4/23) కెరీర్ బెస్ట్ ఫిగర్స్ నమోదు చేసింది. తన స్పిన్ బౌలింగ్‌తో ప్రత్యర్ధి పతనాన్ని శాసించింది. ఆమెతో పాటుపేసర్ క్రాంతి గౌడ్ 3 వికెట్లతో అదరగొట్టింది.

ప్రతీక రావల్ సూపర్ సెంచరీ..
అనంతరం 198 పరుగుల సులభమైన లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఏమాత్రం తడబడలేదు. ఓపెనర్ ప్రతిక రావల్ అద్భుతమైన బ్యాటింగ్‌తో జట్టును విజయపథంలో నడిపించింది. 96 బంతులు ఎదుర్కొన్న ప్రతిక రావల్ అజేయంగా 100 పరుగులు సాధించి తన కెరీర్‌లో మూడో వన్డే శతకాన్ని నమోదు చేసుకుంది. అదేవిధంగా కెప్టెన్ స్మృతి మంధాన అవుట్ అయిన తర్వాత క్రీజులోకి వచ్చిన వైస్ కెప్టెన్ షఫాలీ వర్మ తనదైన శైలిలో విరుచుకుపడింది. జింబాబ్వే బౌలర్లపై ఎదురుదాడికి దిగుతూ కేవలం 33 బంతుల్లోనే అజేయంగా 64 పరుగులు బాదింది. ఫలితంగా లక్ష్యాన్ని భారత్ కేవలం 27.1 ఓవర్లలోనే ఒక్క వికెట్ కోల్పోయి చేధించింది.
Epaper: epaper.vaartha.com
Mona Agarwal: 357.5 పాయింట్లతో చరిత్ర సృష్టించిన భారత షూటర్ మోనా అగర్వాల్

