Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ప్రతీకార దాడులతో ప్రయోజనమేమిటి?

ప్రతీకార దాడులతో ప్రయోజనమేమిటి?

వార్త 1 week ago

Russia-Ukraine War :రష్యా, ఉక్రైన్ యుద్ధం ఎడతెగక సాగుతోంది. రెండు దేశాలు ప్రతీకార దాడులతో రెచ్చిపోతున్నాయి. ఇటీవల రష్యా రాజధాని మాస్కోపై ఉక్రెయిన్ కనివినని రీతిలో దాడులు చేసింది.

రష్యాలోని ఒక రిఫైనరీలో తీవ్ర దాడి జరిగింది. ఇది ఆగ్నేయ మాస్కోలో ఉంది. ఇది అత్యంత పెద్ద రిఫైనరీ. దీని పైనే ఉక్రెయిన్ కన్నేసింది. దీన్ని దెబ్బ తీస్తే రష్యా ఆర్థిక మూలాలు దెబ్బ తింటాయనే ఉద్దేశం తో కపోట్నా జిల్లాలో వున్న రిఫైనరీ పైనే మూడు సార్లు దాడి చేసింది. ఈసారి జరిగిన దాడిలో ఆ రిఫైనరీలో మంటలు ఉవ్వెతున్న ఎగసిపడ్డాయి. ఆ దాడికి ఆకాశమం తా దట్టమైన పొగలతో నిండిపోయింది. ఈ దాడితోరష్యా ఆగ్రహం ప్రకటించింది. మేము అనుకున్న విధంగానే రష్యా ను దెబ్బ తీశామని ఉక్రెయిన్ కూడా ప్రకటన గుప్పిం చింది. ఉక్రెయిన్ ను దెబ్బతీస్తే, మాస్కోను కూడా తీవ్రంగా దెబ్బ తీస్తామని, ఈసారి మా దాడి అత్యంత భయకరంగా ఉంటుందని, ఇక యుద్ధం ముగిపు పలికే సమయం ఆసన్నమైందని, దౌత్య పరంగా రష్యానే యుద్ధంకు ముగింపు పలకాలని అందుకు తగిన చర్యలు తీసుకోవాలని జెలెన్ స్కీ అభిమతంగా ఉంది. కానీ రష్యా అందుకు సుముఖం గా లేదు. ఇదిలా ఉంటే రష్యా ప్రకటన మరో విధంగా ఉంది. ఉక్రెయిన్కు చెందిన దాదాపు వెయ్యి డ్రోనులు, నాలుగు క్షిపణులు ధ్వంసం చేశామని రష్యా ప్రకటించింది. ఇలా ప్రతీకార దాడులతో రెండు కూడా సామరస్యంగా ఆలోచించకుండా దాడులతోనే రెచ్చిపోతు న్నాయి.

Read Also : UK Prime Minister : ఎట్టకేలకు ప్రధాని పదవికి రాజీనామా చేసిన కీర్ స్టార్మర్

 Russia-Ukraine War

Russia-Ukraine War : శాంతి బాటపట్టాలి అనే తలంపు

అయితే ఫ్రాన్స్లో జరిగిన జి 7 దేశాల సదస్సు లో ఐరోపాకు చెందిన సభ్య దేశాలు ఉక్రెయిన్కు మద్దతు ప్రకటించాయి. అమెరికా అధ్యక్షులు ట్రంప్ సమక్షంలో ఈ ప్రకటన చేయడం గమనార్హం. ట్రంప్ ఆలోచన వేరేగా ఉంది. యుద్ధాన్ని నివారించడానికి శాంతిపై మనసు పెడ తామని ట్రంప్ ప్రకటించారు. ట్రంప్ ఆరాటం అంతా రెండు దేశాలు శాంతి బాటపట్టాలి అనే తలంపుగా ఉంది. వాస్తవానికి ఇలా ప్రతీకార దాడులతో నష్టం మనకే అనే విషయం రెండు దేశాలు గ్రహించకపోవడం శోచనీయం. ఇంకా ఎన్నాళ్ళు అని ఈదాడులు నివారించలేని అమెరికా, ఇరాన్ యుద్ధమే శాంతితో ముగిసింది. ఇప్పుడు దృష్టి అంతా రష్యా, ఉక్రెయిన్పైనే ఉంది. దీని నివారణకు ట్రంప్ ఆలోచనలో ఉన్నారు. చిన్న దేశమైనా ఉక్రెయిన్కు ఐరోపా దేశాలు అండగా నిలుస్తున్నాయి. అటు వంటప్పుడు ఉక్రెయిన్కో ఈ ఐరోపా దేశాలు నచ్చజెప్ప వచ్చు అనే మీ మాంస ఎదురవుతోంది. చిన్న దేశమైనా ఉక్రెయిన్ దాడిచాలా భీతహంగా ఉంది. రాజీచర్యలు ఉక్రెయిన్ నుంచే రావాలి అని రష్యా పట్టుదలగా ఉంది. ఇక్కడ యుద్ధం ఆగాలి అంటే ఉక్రెయిన్క ఐరోపా దేశాలు చెప్పాలి. ట్రంప్ కూడా ఉక్రెయిన్కో చెబితే యుద్ధం ఆగిపోయే అవకాశాలున్నాయి. ఒకవేళ ఉక్రెయిన్ రాజీకి ఒప్పు కుంటే దాని పునర్ నిర్మాణానికి అంటే రష్యా దాడులతో నష్టపోయిన ప్రాంతాలను, కట్టాడాలను రష్యానే నిర్మాణం చేపట్టాలి. మరి. ఉక్రెయిన్ దాడితో నష్టపోయిన రష్యాలోని కట్టడాలను ఎవరు పునర్ నిర్మిస్తారు అనే ప్రశ్న ఉదయి స్తుంది. అదే పెద్దసమస్యగా ఉంది. దీనికి ఒక కార్యాచరణ
రూపొందించాలి. ప్రతీకార దాడులతో నష్టాన్ని నివారించా లి. రెండు దేశాలకు ఆమోదయోగ్యమైన చర్యలు చేపడితే యుద్ధం నివారణ ఆగిపోగలదు. దీనికి భారత్ కూడా ప్రయత్నం చేయాలి. ట్రంప్, మోడీ కలిసి ఈ యుద్ధానికి ముగింపు పలుకుతారని ఆశిద్దాం.

-కనుమ ఎల్లారెడ్డి

Read hindi news : hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

ఖతార్‌లో భారీ పేలుడుతో ప్రపంచ వ్యాప్తంగా ఇంధన సరఫరాపై ఆందోళనలు..

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha