Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Pratima Singh: ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేయాలి

Pratima Singh: ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేయాలి

వార్త 2 months ago

Pratima Singh: ప్రజా ప్రతినిధులు అధికారులు సమన్వయంతో పని చేసి ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు.

గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ప్రజా పాలనా ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ చైర్మన్లకు, కౌన్సిలర్లకు, సర్పంచులకు ప్రభుత్వ పథకాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్,మెదక్ శాసనసభ్యులు మైనంపల్లి రోహిత్ రావు, జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు, ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక నోడల్ అధికారి శ్రీనివాసరావు, అదనపు కలెక్టర్ నగేష్ లు పాల్గొన్నారు.

జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభం

ఈ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వనంచేసి, తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయ హే.. తో ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ.. పట్టణ ,గ్రామస్థాయిలో ప్రజా ప్రతినిధులు అధికారుల సమన్వయంతో ప్రభుత్వ సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు చేరాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఒక బృహత్కర కార్యక్రమం ఇది అని అన్నారు. గ్రామ సర్పంచులు గ్రామం నాది అనే స్వభావాన్ని కలిగి ఉండాలన్నారు. 99 రోజుల్లో అనేక కార్యక్రమాల చేపడుతునట్లు చెప్పారు.

సుబిక్షమైన పట్టణ ,పల్లెల కోసం నిరంతరం కృషి చేయాలన్నారు. శాసన సభ్యులు మైనంపల్లి రోహిత్ రావు మాట్లాడుతూ..ఇందిరమ్మ రాజ్యంలో ప్రజల అబివృద్ధి, ప్రభుత్వ సంక్షేమ పథకాల కోసం నిరతరం శ్రమిస్తున్నట్లు తెలిపారు. ఇందిరమ్మ ఇండ్లు, జీరో విద్యుత్,సన్నబియ్యం,మెడికల్ కాలేజీ,యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణం లాంటి అనేక పథకాలు చేపట్టామన్నారు.అధికారులు ప్రజా ప్రతినిధులు ప్రజల సమస్యలను తీర్చి, పథకాలు ముందుకు తీసుకెళ్లాలన్నారు.

ఫోటో ఎగ్జిబిషన్ సందర్శన

జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. శాంతి భద్రతను కాపాడాలని,రోడ్డు ప్రమాదాల వల్ల రోజు రోజుకు మరణాల సంఖ్య పెరుగుతుందని, ట్రాఫిక్ నిబంధనలు పాటించి,డ్రగ్స్,సైబర్ క్రైమ్ పై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. నోడల్ అధికారి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. పట్టణ,గ్రామీణ ప్రజా ప్రతినిధుల పదవి చిన్నదైన బాధ్యత పెద్దదన్నారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజా అవసరాలను తీర్చాలన్నారు. అదనపు కలెక్టర్ నగేష్ మాట్లాడుతూ..పట్టణ,గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి పథంలో నడవాలంటే ప్రజా ప్రతినిధులు అధికారులు ప్రజల సమస్యలను గుర్తించి, పరిష్కారం చూపించాలన్నారు.

అంతకు ముందు సమాచార పౌర సంబంధాల శాఖ మెదక్ జిల్లా వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమాల ఫోటోల ఎగ్జిబిషన్ ను అదనపు కలెక్టర్ నగేష్,జిల్లా అధికారులతో కలసి జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ తిలకించారు.ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈఓ ఎల్లయ్య, ఆర్డీవో రమాదేవి, మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, సర్పంచులు, అధికారులు పాల్గొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Telangana Assembly: స్పీకర్ తీర్పు పై కడియం శ్రీహరి ఏమన్నారంటే?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha