Smriti Mandhana: భారత మహిళా క్రికెట్ స్టార్, జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధాన సరికొత్త చరిత్ర సృష్టించారు. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే 'టైమ్ మ్యాగజైన్' (TIME Magazine) తాజాగా విడుదల చేసిన క్రీడా రంగంలోని అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో ఆమెకు చోటు దక్కింది.
అంతర్జాతీయ క్రీడారంగంలో తమ ప్రతిభతో, నాయకత్వ లక్షణాలతో చెరగని ముద్ర వేస్తున్న క్రీడాకారులు, కోచ్‌లు, నిర్వాహకులతో రూపొందించిన ఈ ప్రత్యేక జాబితాలో మంధాన స్థానం సంపాదించుకోవడం విశేషం.
Read Also : Karnataka CM: AI టౌన్‌షిప్ ప్రాజెక్టును సమర్థించుకున్న డి.కె. శివకుమార్
Cricketer Smriti Mandhana in the prestigious ‘Time Magazine’ list!
Smriti Mandhana: టాప్-100లో నిలిచిన ఏకైక భారతీయ క్రీడాకారిణి
2026 సంవత్సరానికి గానూ టైమ్ మ్యాగజైన్ ప్రకటించిన ‘వరల్డ్ టాప్-100 మోస్ట్ ఇన్‌ఫ్లూయెన్షియల్ పీపుల్ ఇన్ స్పోర్ట్స్’ జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక భారతీయ అథ్లెట్‌గా స్మృతి మంధాన నిలిచారు. మైదానంలో ఆమె ప్రదర్శించే నిలకడైన బ్యాటింగ్ తీరు, ఆర్‌సీబీ (RCB) జట్టును డబ్ల్యూపీఎల్ (WPL) విజేతగా నిలిపిన ఆమె కెప్టెన్సీ వైభవం, భారత మహిళా క్రికెట్ వృద్ధిలో ఆమె పోషిస్తున్న కీలక పాత్రే ఈ అంతర్జాతీయ గుర్తింపునకు కారణమయ్యాయి.
ఈ ప్రతిష్ఠాత్మక జాబితాలో అంతర్జాతీయ క్రీడా ప్రపంచాన్ని శాసిస్తున్న దిగ్గజాలకు అగ్రతాంబూలం దక్కింది. అమెరికన్ బాస్కెట్‌బాల్ లెజెండ్ లెబ్రాన్ జేమ్స్, అర్జెంటీనా ఫుట్‌బాల్ ఐకాన్ లియోనెల్ మెస్సీ, అలాగే పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో వంటి గ్లోబల్ సూపర్ స్టార్స్ ఈ జాబితాలో ప్రముఖంగా నిలిచారు. వీరితో పాటు టెన్నిస్ సంచలనం కార్లోస్ అల్కరాజ్ కూడా ఈ ప్రభావవంతమైన క్రీడాకారుల లిస్ట్‌లో చోటు సంపాదించుకున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :
ఇకపై డాక్టర్ చీటీ ఉంటేనే దగ్గు మందు.. మెడికల్ షాపులకు ప్రభుత్వం గట్టి వార్నింగ్!

