Dasara Diwali Special Trains: దసరా, దీపావళి పండుగల సీజన్‌లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే (SCR) కీలక నిర్ణయం తీసుకుంది.
సొంత ఊళ్లకు వెళ్లే ప్రయాణికుల కోసం ఏకంగా 750కి పైగా ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ప్రయాణికులు అత్యధికంగా రాకపోకలు సాగించే ప్రధాన మార్గాల్లో ఈ ప్రత్యేక సర్వీసులు అందుబాటులో ఉంటాయని తెలిపింది.
Read Also : LB Nagar corridor: ఎల్బీనగర్ హయత్‌నగర్ ఫ్లైఓవర్‌కి గ్రీన్ సిగ్నల్
Good news for passengers: 750 special trains for Dussehra and Diwali.
Dasara Diwali Special Trains: రద్దీకి అనుగుణంగా అదనపు రైళ్లు – సౌకర్యాలు
ఈ ప్రత్యేక రైళ్ల వివరాలను దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్‌ఓ శ్రీధర్ మీడియాకు వెల్లడించారు. ప్రయాణికుల అవసరాలు, రద్దీ తీవ్రతను బట్టి భవిష్యత్తులో రైళ్ల సంఖ్యను మరింత పెంచేందుకు రైల్వే శాఖ సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. పండుగ వేళ రైల్వే స్టేషన్లలో భద్రతా చర్యలు, ప్రయాణ ప్రాంగణంలో ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు:
- రద్దీని తట్టుకోవడానికి అదనపు టికెట్ కౌంటర్ల ఏర్పాటు.
- ప్రయాణికుల భద్రత కోసం సీసీటీవీ (CCTV) కెమెరాల ద్వారా నిరంతర నిఘా.
- స్టేషన్లలో సమాచార కేంద్రాలు, మార్గదర్శక సేవలు.
అదనపు ఛార్జీలు వర్తింపు
పండుగ ప్రత్యేక రైళ్లలో ప్రయాణించే వారు సాధారణ ఛార్జీల కంటే కొంత అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ రైళ్లలో మూడో వంతు (1/3rd) మేర అదనపు ఛార్జీని వసూలు చేయనున్నట్లు రైల్వే శాఖ స్పష్టం చేసింది. కాబట్టి పండుగలకు ప్రయాణాలు ప్లాన్ చేసుకునే వారు ఈ ఛార్జీల మార్పును గమనించి, అందుకు అనుగుణంగా ముందస్తుగా టికెట్లు బుక్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

