UP Crime: ఉత్తరప్రదేశ్‌లోని బండా జిల్లాలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకుందన్న కక్షతో ఒక కన్న తండ్రి మృగంలా మారాడు. ఏకంగా చట్టాన్ని రక్షించాల్సిన పోలీస్ స్టేషన్ ఆవరణలోనే అందరూ చూస్తుండగా కూతురిపై కత్తితో ఘాతుకానికి ఒడిగట్టాడు.
తీవ్ర గాయాలపాలైన సదరు యువతి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది.
పోలీసుల వివరాల ప్రకారం.. బదౌసా పోలీస్ స్టేషన్ పరిధిలోని బర్చా గ్రామానికి చెందిన 19 ఏళ్ల శివాని, అదే ప్రాంతానికి చెందిన లలిత్ అనే యువకుడిని ప్రేమించింది. మే 18న వీరిద్దరూ ఇళ్లనుంచి వెళ్ళిపోయి ఒక ఆలయంలో ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే, లలిత్ తన కుమార్తెను ప్రలోభపెట్టి కిడ్నాప్ చేశాడంటూ శివాని తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు లలిత్, శివానిల కోసం గాలింపు చేపట్టారు. జూన్ 12 (శుక్రవారం) నాడు మధ్యప్రదేశ్‌లోని సత్నా జిల్లా బరౌండా ప్రాంతంలో ఈ జంటను గుర్తించిన పోలీసులు, వారిని అదుపులోకి తీసుకుని బదౌసా పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
Read Also : HYD Miyapur Incident: మియాపూర్‌లో దారుణం.. బిడ్డతో సహా బిల్డింగ్ పైనుంచి దూకిన టెక్కీ
Young woman dies after being attacked with a knife by her father for entering into a love marriage
UP Crime: స్టేషన్ లోపలే కన్న తండ్రి ఘాతుకం
సమాచారం అందుకున్న ఇరు కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. పోలీసుల విచారణలో 19 ఏళ్ల శివాని తాను మైనర్‌ను కాదని, స్వచ్ఛందంగానే లలిత్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నానని, తన భర్తతోనే కలిసి జీవిస్తానని తేల్చి చెప్పింది. ఈ మాటలు విన్న ఆమె తండ్రి సత్యకుమార్ అవమానంతో, తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయాడు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా తను వెంట తెచ్చుకున్న పదునైన కత్తితో అందరూ చూస్తుండగానే శివానిపై విచక్షణారహితంగా దాడి చేశాడు. ప్రత్యక్ష సాక్షుల ప్రకారం.. ఆమెను పలుమార్లు కత్తితో బలంగా పొడిచాడు. ఈ క్రమంలో పక్కనే ఉన్న తల్లి కూడా అడ్డుకోకపోవడం గమనార్హం.
చికిత్స పొందుతూ యువతి మృతి
పోలీసులు వెంటనే స్పందించి తీవ్ర రక్తస్రావంతో పడిపోయిన శివానిని సమీప కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. పరిస్థితి అత్యంత విషమంగా మారడంతో బండాలోని రాణి దుర్గావతి మెడికల్ కాలేజీకి రిఫర్ చేశారు. అక్కడ వైద్యులు ఆమె ప్రాణాలు కాపాడేందుకు తీవ్రంగా శ్రమించినప్పటికీ, అంతర్గత అవయవాలకు బలమైన గాయాలు కావడంతో చికిత్స పొందుతూ శివాని కన్నుమూసింది.
నిందితుడైన తండ్రి అరెస్ట్
ఈ ఘోరానికి పాల్పడిన తండ్రి సత్యకుమార్‌ను పోలీసులు అక్కడికక్కడే అరెస్ట్ చేసి ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు. బండా ఎస్పీ పలాష్ బన్సల్ ఈ ఘటనను ధృవీకరిస్తూ.. నిందితుడిపై హత్య కేసు (Section 302) నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు. స్టేషన్‌లో జరిగిన భద్రతా వైఫల్యంపై కూడా అంతర్గత విచారణ జరుపుతామని తెలిపారు. ప్రేమ వివాహాన్ని అంగీకరించలేక కన్న కూతురినే బలితీసుకున్న ఈ ‘ఆనర్స్ కిల్లింగ్’ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని, ఆగ్రహాన్ని నింపింది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :
వనస్థలిపురంలో అక్రమ లింగ నిర్ధారణ పరీక్షలు.. ముగ్గురు అరెస్ట్

