Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ప్రేమ పెళ్లి చేసుకున్నాడని అబ్బాయిపై దాడి..అమ్మాయిని లాక్కెళ్లిన కన్నవారు

ప్రేమ పెళ్లి చేసుకున్నాడని అబ్బాయిపై దాడి..అమ్మాయిని లాక్కెళ్లిన కన్నవారు

వార్త 1 month ago

Medak Inter Caste Marriage : తెలంగాణలోని మెదక్ జిల్లాలో కులాంతర ప్రేమ వివాహం వ్యవహారం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఎల్లపూర్ గ్రామానికి చెందిన ప్రణయ్, సలాబత్‌పూర్ గ్రామానికి చెందిన ఒక యువతి గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు.

వీరిద్దరిది వేర్వేరు కులాలు కావడంతో అమ్మాయి ఇంట్లో పెళ్లికి నిరాకరించారు. అయినప్పటికీ, ఈ నెల 6వ తేదీన ఈ ప్రేమికులు ఇద్దరూ కులాంతర వివాహం చేసుకున్నారు. తమ కూతురు వేరే కులం అబ్బాయిని పెళ్లి చేసుకుందనే కోపంతో యువతి కుటుంబ సభ్యులు, బంధువులు ప్రణయ్ కుటుంబంపై కక్ష పెంచుకున్నారు. ఈ వివాదం పోలీస్ స్టేషన్‌కు చేరడంతో పోలీసులు ఇరు వర్గాలను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఆ సమయంలో పోలీసులు యువతిని విచారించగా, తాను మేజర్‌నని, తన ఇష్టప్రకారమే ప్రణయ్‌ను పెళ్లి చేసుకున్నానని స్పష్టం చేసింది. చచ్చినా తన భర్తతోనే ఉంటానని, కన్నవారి ఇంటికి వెళ్లే ప్రసక్తే లేదని పోలీసుల ముందే తెగేసి చెప్పింది. దీంతో పోలీసులు ఇరు కుటుంబాల వారికి చట్టపరమైన నిబంధనలను వివరించి పంపించి వేశారు.

Read Also: Madhya Pradesh Road Accident: గమ్యం చేరకముందే విషాదం.. రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం!

 Medak Inter Caste Marriage

Medak Inter Caste Marriage : సినిమా ఫక్కీలో అటాక్.. జుట్టు పట్టుకుని లాకెళ్లిన బంధువులు

పోలీసుల హెచ్చరికలను ఏమాత్రం ఖాతరు చేయని యువతి బంధువులు ఒక పక్కా స్కెచ్ ప్రకారం దాడికి తెగబడ్డారు. నాలుగు కార్లలో భారీగా అనుచరులతో కలిసి నేరుగా ఎల్లపూర్‌లోని ప్రణయ్ నివాసానికి చేరుకున్నారు. ఇళ్లను చుట్టుముట్టి లోపలికి చొరబడి అక్కడున్న వారిపై కర్రలతో విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డారు. భర్తను వదిలి రానంటూ గట్టిగా కేకలు వేస్తున్న యువతిని జుట్టు పట్టుకుని లాగుతూ బలవంతంగా కార్లలో ఎక్కించుకుని సినిమా ఫక్కీలో కిడ్నాప్ చేసి పరారయ్యారు. ఈ అకస్మాత్తు దాడిలో గాయపడిన ప్రణయ్ కుటుంబ సభ్యులను స్థానికులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. కిడ్నాప్‌కు గురైన యువతిని రక్షించేందుకు, దాడికి పాల్పడిన నిందితులను పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

మహిళా డాక్టర్‌పై దాడి కేసులో శివసేన కార్పొరేటర్‌ అరెస్ట్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha