Devarapalli incident:అల్లూరి సీతారామరాజు జిల్లా చోడవరం మండలం అంబేరపురం గ్రామానికి చెందిన కోడూరు దివ్య 26 ఏళ్ల వయస్సులో కన్నుమూసింది. దివ్య విశాఖపట్నంలోని బంగారు ఆభరణాల దుకాణంలో ఉద్యోగం చేసేది.
అక్కడ పని చేసే సమయంలో ఓ యువకుడితో పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారింది. అయితే వీరి ప్రేమ వ్యవహారం విఫలం కావడంతో దివ్య తీవ్ర మనస్తాపానికి గురైంది.
Read also: BIEAP supply results 2026: AP ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి
Young woman commits suicide over failed love
బంధువుల ఇంట్లో విషాదం
దివ్య దేవరాపల్లిలోని తన బంధువుల ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడింది. మంగళవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో చున్నీతో ఉరి వేసుకొని ప్రాణాలు తీసుకుంది. కుటుంబ సభ్యులు ఈ విషయం తెలుసుకొని షాక్‌కు గురయ్యారు. ప్రేమించిన వ్యక్తిని మరువలేక దివ్య ఈ నిర్ణయం తీసుకోవడం స్థానికంగా కలకలం రేపింది.
Devarapalli incident:కేసు నమోదు చేసి విచారణ
మృతురాలి తండ్రి సన్నిబాబు ఫిర్యాదు మేరకు దేవరాపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్సై సత్యనారాయణ సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి, తదుపరి చర్యలు తీసుకుంటున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:

