Faridabad crime, : హరియాణాలోని ఫరీదాబాద్ లో రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ క్రీడాకారుడి హత్య కలకలం రేపింది. ప్రేమ వ్యవహారం కారణంగా యువతి కుటుంబ సభ్యులే అతడిని కిడ్నాప్ చేసి చిత్రహింసలకు గురిచేసి చంపినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రేమ వ్యవహారంతో వివాదం
రాజస్థాన్‌లోని అల్వార్ జిల్లాకు చెందిన 21 ఏళ్ల మోనూ రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ ప్లేయర్‌గా గుర్తింపు పొందాడు. Rajasthan కు చెందిన ఈ యువకుడు ఇటీవల ఇంటర్మీడియట్ పరీక్షల్లో కూడా మంచి మార్కులు సాధించాడు. ఫరీదాబాద్‌కు చెందిన ఓ బాలికతో అతనికి ప్రేమ వ్యవహారం ఉన్నట్లు సమాచారం.
కిడ్నాప్ చేసి బంధించినట్లు ఆరోపణలు
యువతి కుటుంబ సభ్యులు ఈ సంబంధాన్ని వ్యతిరేకించారని, మే 17న మోనూను కిడ్నాప్ చేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మూడు రోజుల పాటు ఒకచోట బంధించి తీవ్రంగా కొట్టినట్లు తెలిపారు.
తీవ్ర గాయాలతో బయటపడిన యువకుడు
మే 20న యువతి తండ్రి ఇంటి సమీపంలో మోనూ తీవ్ర గాయాలతో కనిపించినట్లు పోలీసులు తెలిపారు. వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ చికిత్స పొందుతూ అతడు మరణించాడు.
Read also : Gates College Free EV Training: నిరుద్యోగులకు గేట్స్ కళాశాల బంపర్ ఆఫర్!
Faridabad crimeపరువు హత్య కోణంలో దర్యాప్తు
ఈ ఘటనను పోలీసులు పరువు హత్యగా అనుమానిస్తున్నారు. హర్యానా పోలీస్ హత్య, కిడ్నాప్ కేసులు నమోదు చేసి ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుంది. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలపై దర్యాప్తు కొనసాగుతోంది.
గతంలో కూడా కేసు
ఇంతకుముందు ఏప్రిల్ నెలలో మోనూ ఆ బాలికతో కలిసి వెళ్లిపోయాడని, ఆ సమయంలో యువతి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదైందని పోలీసులు వెల్లడించారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

