Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ప్రియాంక కేసులో చంద్రబాబు ప్రభుత్వం పై జగన్ ఘాటు వ్యాఖ్యలు!

ప్రియాంక కేసులో చంద్రబాబు ప్రభుత్వం పై జగన్ ఘాటు వ్యాఖ్యలు!

వార్త 2 weeks ago

Dr Priyanka Case: రాజమహేంద్రవరంలో మెడికల్ పీజీ విద్యార్థిని డాక్టర్ ప్రియాంక ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఘటనపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

తల్లిదండ్రులు ఎన్నో కష్టాలు, త్యాగాలు చేసి ప్రియాంకను డాక్టర్‌గా తీర్చిదిద్దారని, ఎండీ చదువులు చదువుతున్న సమయంలో ఆమె మృతి చెందడం అత్యంత హృదయవిదారకమని పేర్కొంటూ ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అదే సమయంలో, ఈ కేసులో కూటమి ప్రభుత్వ తీరును, పోలీసు యంత్రాంగం వ్యవహరించిన తీరును జగన్ తీవ్రంగా తప్పుపట్టారు.

Read Also:Dr Priyanka Death Case: రాజమండ్రిలో నేడు విద్యాసంస్థల బంద్ కు పిలుపు

Dr Priyanka Case: వైఎస్ జగన్ లేవనెత్తిన ప్రధాన విమర్శలు & డిమాండ్లు

ఆగస్టు 3వ తేదీ రాత్రి ఒక షాపింగ్‌మాల్ గేటు బయటే ఈ ఘటన జరిగింది. నిందితులు మద్యం తాగి ఉన్నారని తెలిసినా, కారుతో ప్రియాంక స్కూటర్‌ను ఢీకొట్టి, అనంతరం అమానవీయంగా బాధితురాలి మీద నుంచి కారు తోలిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో స్పష్టంగా కనిపించినప్పటికీ పోలీసులు చిన్న ప్రమాద కేసుగా మార్చి నిందితులను వదిలేయడంపై పూర్తిస్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం కేవలం ప్రతిపక్షాల మీద, ప్రశ్నించేవారి మీద 'రెడ్ బుక్ రాజ్యాంగం'తో విరుచుకుపడటానికే పోలీసు వ్యవస్థను వాడుకుంటోందని, సామాన్యులకు న్యాయం చేయడంలో చట్టం ఘోరంగా విఫలమైందని మండిపడ్డారు. వీధికి రెండు బెల్టుషాపులు, బార్ అండ్ రెస్టారెంట్లతో కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో మద్యం, గంజాయి సంస్కృతికి బ్రాండ్ అంబాసిడర్‌గా మారిందని, ఇలాంటి అక్రమాలు, నిబంధనల ఉల్లంఘనలే ఈ ఘోర ప్రమాదాలకు కారణమవుతున్నాయని జగన్ ఆరోపించారు. ప్రియాంక కేసులో ప్రభుత్వ, పోలీసు వైఫల్యాలను ఎత్తిచూపుతూ సోషల్ మీడియాలో ప్రశ్నిస్తుంటే, ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక నిమిషాల వ్యవధిలోనే కంటెంట్‌ను తొలగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Epaper: epaper.vaartha.com

మెడికో ప్రియాంక కుటుంబానికి అండగా సీఎం చంద్రబాబు.. రూ.20 లక్షల సాయం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha