Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ప్రియుడి కోసం భర్త హత్య.. JCBతో పూడ్చిపెట్టిన భార్య

ప్రియుడి కోసం భర్త హత్య.. JCBతో పూడ్చిపెట్టిన భార్య

వార్త 3 months ago

సంగారెడ్డిలో దారుణ హత్య కలకలం

Sangareddy Murder Case : తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంతో ఓ మహిళ తన ప్రియుడితో కలిసి భర్తను అత్యంత కిరాతకంగా హత్య చేసిన ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.

నర్సుగా పనిచేస్తూ ఏర్పడిన పరిచయం

గంగాపూర్‌కు చెందిన ముత్యంరెడ్డి, కల్పన దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. కల్పన నారాయణఖేడ్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తోంది. ఈ సమయంలో ఆమెకు చింటూ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి, అది క్రమంగా వివాహేతర సంబంధానికి దారితీసినట్లు పోలీసులు వెల్లడించారు.

పక్కా ప్లాన్‌తో హత్య

తమ సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన కల్పన, చింటూ కలిసి ముత్యంరెడ్డిని హత్య చేయాలని నిర్ణయించుకున్నారు. పథకం ప్రకారం ఎల్గోయి శివారు ప్రాంతంలో అతడిని హత్య చేసి, ఆధారాలు బయటపడకుండా ఉండేందుకు జేసీబీతో గుంత తవ్వి శవాన్ని పూడ్చిపెట్టినట్లు పోలీసులు తెలిపారు.

Read also : Gates College Free EV Training: నిరుద్యోగులకు గేట్స్ కళాశాల బంపర్ ఆఫర్!

 Sangareddy Murder Case

మిస్సింగ్ కేసుతో బయటపడిన నిజం

ముత్యంరెడ్డి కనిపించడం లేదంటూ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు కల్పన, చింటూ ప్రవర్తనపై అనుమానం వచ్చి విచారించగా అసలు విషయం బయటపడింది. ఇద్దరూ నేరాన్ని ఒప్పుకోవడంతో పోలీసులు వారిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

ఇన్ఫినిటీ ఛారిటబుల్ ట్రస్ట్‌కు ప్రతిష్టాత్మక అవార్డు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha