Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ప్రియుడి కోసం రెండేళ్ల కొడుకును కొట్టి చంపిన కన్నతల్లి

ప్రియుడి కోసం రెండేళ్ల కొడుకును కొట్టి చంపిన కన్నతల్లి

వార్త 2 weeks ago

Keesara Mother Kills Son: మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో మానవత్వాన్ని మంటగలిపే దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. పరాయి వ్యామోహానికి లొంగిపోయిన ఒక కన్నతల్లి, తన ప్రియుడితో గడపడానికి అడ్డు వస్తున్నాడని భావించి కంటికి రెప్పలా చూసుకోవాల్సిన రెండేళ్ల సొంత కొడుకును అత్యంత అమానుషంగా హత్య చేసింది.

సమాజం తలదించుకునేలా ఉన్న ఈ షాకింగ్ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

Read Also : Bandi Bhagirath Case Updates: బండి భగీరథ్‌కు పోక్సో కేసులో ఊరట

 Mother beats two-year-old son to death for the sake of her lover.

Keesara Mother Kills Son: అసలేం జరిగిందంటే..?

పోలీసుల కథనం ప్రకారం.. సిద్దిపేట జిల్లాకు చెందిన జ్యోతి, స్వామి దంపతులు ఉపాధి వెతుక్కుంటూ మేడ్చల్ జిల్లా కీసరకు వలసవచ్చి అక్కడే నివాసం ఉంటున్నారు. అయితే జ్యోతికి వివాహానికి ముందే నవీన్ అనే వ్యక్తితో ప్రేమాయణం ఉంది. పెళ్లయి పిల్లలు ఉన్నప్పటికీ ఆమె తన పాత ప్రియుడితో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తూ వచ్చింది. ఈ క్రమంలోనే గత నెల 29న భర్త ఇంట్లో లేని సమయంలో ప్రియుడు నవీన్ జ్యోతి ఇంటికి వచ్చాడు. ఇద్దరూ ఏకాంతంగా గడుపుతున్న సమయంలో జ్యోతి రెండేళ్ల కుమారుడు గట్టిగా ఏడవడం ప్రారంభించాడు. బాలుడి ఏడుపునకు విసుగు చెందిన ప్రియుడు నవీన్.. వీడు మనకు అడ్డుగా ఉన్నాడు, వీడిని చంపేయ్ అంటూ జ్యోతిని ఉసిగొల్పాడు. దీంతో కన్నప్రేమను మర్చిపోయిన ఆ రాక్షస తల్లి, పసివాడని కూడా చూడకుండా ఆ బాలుడిని గాల్లోకి లేపి నేలకేసి బలంగా కొట్టింది. తీవ్ర గాయాలైన ఆ రెండేళ్ల పసికందు అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు.

ఫిట్స్ అంటూ డ్రామా.. భర్త అనుమానంతో వెలుగులోకి!

బాబు చనిపోయిన తర్వాత జ్యోతి, నవీన్‌లు కలిసి ఒక కిరాతక ప్లాన్ వేశారు. ఆ తర్వాత ఇంటికి వచ్చిన భర్త స్వామిని జ్యోతి నమ్మించే ప్రయత్నం చేసింది. బాబుకు అకస్మాత్తుగా తీవ్రమైన ఫిట్స్ (జబ్బు) వచ్చిందని, ఆసుపత్రికి తీసుకెళ్లే లోపే చనిపోయాడని అబద్ధాలు చెప్పి నమ్మించింది. భర్త కూడా అది నిజమేనని భావించి బాబుకు అంత్యక్రియలు పూర్తి చేశాడు. అయితే, గత కొన్ని రోజులుగా భార్య ప్రవర్తనపై అనుమానం వచ్చిన భర్త స్వామి.. బాబు మరణంపై గట్టిగా నిలదీసి విచారించగా జ్యోతి చేసిన పాపం బయటపడింది. ప్రియుడితో కలిసి తానే కొడుకును చంపేసినట్లు భర్త ముందు నిజం ఒప్పుకుంది. భార్య చేసిన ఘోరాన్ని విన్న భర్త స్వామి తక్షణమే కీసర పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. ఈ దారుణ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితురాలైన తల్లి జ్యోతిని, ఆమె ప్రియుడు నవీన్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పరాయి మొగుడి కోసం కన్నబిడ్డనే బలితీసుకున్న ఆ తల్లిపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

కేరళలోని ఒక ప్రార్థనా కేంద్రంలో పిల్లలపై వేధింపులు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha