Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ప్రియురాలి కోసం అత్త దారుణ హత్య: ఖమ్మం జిల్లాలో సంచలనం రేపిన కేసు

ప్రియురాలి కోసం అత్త దారుణ హత్య: ఖమ్మం జిల్లాలో సంచలనం రేపిన కేసు

వార్త 2 weeks ago

Khammam Crime : ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం తుంబూరులో చోటుచేసుకున్న వృద్ధురాలు గుండాల వెంకటనర్సమ్మ (65) అదృశ్యం కేసును పోలీసులు ఛేదించారు. తన వివాహేతర సంబంధానికి అడ్డు వస్తోందనే కక్షతో అల్లుడు వెదుళ్ల తిరుపతిరావు, అతని ప్రియురాలు పగుట్ల సునీత కలిసి వృద్ధురాలిని అత్యంత దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు.

కేసు వివరాలను సత్తుపల్లి ఇన్‌ఛార్జి ఏసీపీ సారంగపాణి వెల్లడించారు.తుంబూరుకు చెందిన తిరుపతిరావుకు ఇద్దరు భార్యలు కాగా, మొదటి భార్యను వదిలేసి గుండాల మంగమ్మను 30 ఏళ్ల క్రితం రెండో వివాహం చేసుకున్నాడు. అయితే, కొంతకాలంగా అదే గ్రామానికి చెందిన వితంతువు పగుట్ల సునీతతో తిరుపతిరావు వివాహేతర సంబంధం నడుపుతున్నాడు.ఈ విషయం తెలిసి తిరుపతిరావు భార్య మంగమ్మ, అత్త వెంకటనర్సమ్మ తీవ్రంగా నిలదీశారు.జులై 30న సునీతతో గొడవపడి ఆమెను తిట్టి కొట్టడంతో, తనకు తీవ్ర అవమానం జరిగిందని సునీత తిరుపతిరావుకు చెప్పింది. తమ బంధం కొనసాగాలంటే వెంకటనర్సమ్మను అడ్డు తొలగించుకోవాలని ఒత్తిడి తెచ్చింది.

Read Also: killing girlfriend in US: అమెరికాలో ప్రేమికురాలిని హత్య కేసులో భారతీయ విద్యార్థి అరెస్ట్

 Khammam Crime

Khammam Crime : కుర్చీలో ఉండగానే చీరతో ఉరి.. రెండుసార్లు శవాన్ని తగలబెట్టిన దారుణం

దీంతో ఈ నెల 2న అర్థరాత్రి తిరుపతిరావు, సునీత కలిసి వెంకటనర్సమ్మ ఇంటికి వెళ్లారు. టీవీ చూస్తూ కుర్చీలో కూర్చున్న వృద్ధురాలి మెడకు చీర కొంగు బిగించి దారుణంగా హత్య చేశారు.మొదటి ప్రయత్నం: మృతదేహాన్ని ద్విచక్ర వాహనంపై నారాయణపురం దాటిన తర్వాత ఒక విజన ప్రదేశానికి తీసుకెళ్లి ఎండిపోయిన కట్టెలు, కొబ్బరి మట్టలపై పెట్టి పెట్రోల్ పోసి తగలబెట్టారు. మరుసటి రోజు వచ్చి చూడగా మృతదేహం పూర్తిగా కాలలేదని గ్రహించారు. రెండో ప్రయత్నం: ఆగస్టు 3న అర్థరాత్రి కాలిన అవశేషాలను ఒక కార్పెట్‌లో చుట్టి మరో గుట్టపైకి తీసుకెళ్లి కట్టెలు, పెట్రోల్ ఉపయోగించి పూర్తిగా దహనం చేశారు. అనంతరం ఏమీ తెలియనట్లు అత్త కనిపించడం లేదని నాటకమాడారు. కేసు తీవ్రం కావడంతో దొరికిపోతాననే భయంతో తిరుపతిరావు ఆగస్టు 7న గ్రామ సర్పంచ్, జీపీఓలను కలిసి తనను కాపాడాలని కోరాడు. వారు పోలీసులకు లొంగిపోవాలని సూచించడంతో పరారయ్యాడు. పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచి నిందితులను గురుభట్లగూడెం క్రాస్ రోడ్డు వద్ద అరెస్ట్ చేశారు. వారి నుంచి బైక్, సెల్‌ఫోన్లు, పెట్రోల్ బాటిళ్లను స్వాధీనం చేసుకుని సత్తుపల్లి కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్ విధించారు.

Epaper: epaper.vaartha.com

రాజమండ్రిలో నేడు విద్యాసంస్థల బంద్ కు పిలుపు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha