Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ప్రొఫెసర్ నాగేశ్వర్ రావు మేధావి కాదు.. కరుడుగట్టిన తీవ్రవాది: సోము వీర్రాజు!

ప్రొఫెసర్ నాగేశ్వర్ రావు మేధావి కాదు.. కరుడుగట్టిన తీవ్రవాది: సోము వీర్రాజు!

వార్త 2 months ago

Somu Veerraju Comments on Nageshwar: ఒక మీడియా సమావేశంలో సోము వీర్రాజు మాట్లాడుతూ ప్రొఫెసర్ నాగేశ్వర్‌రావుపై వ్యక్తిగతంగా, రాజకీయంగా కఠిన పదజాలంతో విరుచుకుపడ్డారు.

“ప్రొఫెసర్ నాగేశ్వర్ రావు ఎంతమాత్రం మేధావి కాదు.. ఆయన ఒక కరుడుగట్టిన తీవ్రవాది, నక్సలైట్” అంటూ సంచలన ఆరోపణలు చేశారు. నిరంతరం బీజేపీ విధానాలను తప్పుబడుతూ, పార్టీకి వ్యతిరేకంగా పని చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న వ్యక్తి అంటూ ఆయన మండిపడ్డారు.

Read also:Mahalakshmi Smart Card : జూన్ 2 నుంచి 'మహాలక్ష్మి' స్మార్ట్ కార్డులు పంపిణి

 Somu Veerraju Sensational Comments Professor Nageshwar Rao Terrorist Naxalite BJP AIMIM Alliance

కమ్యూనిజం కాపాడుకోలేక టీవీల్లో కబుర్లు

నాగేశ్వర్‌రావు వామపక్ష భావజాలాన్ని టార్గెట్ చేస్తూ సోము వీర్రాజు మరికొన్ని వ్యాఖ్యలు చేశారు. దేశంలోనూ, అంతర్జాతీయంగానూ కమ్యూనిజం మనుగడ కోల్పోతోందని ఎద్దేవా చేశారు. “కమ్యూనిజాన్ని కనీసం కాపాడుకోలేక, ఉనికి కోసం ఇప్పుడు టీవీ ఛానళ్ల స్టూడియోల ముందు కూర్చొని మేధావి ముసుగులో మాట్లాడుతున్నాడు” అని తీవ్ర విమర్శలు గుప్పించారు.

Somu Veerraju Comments on Nageshwar:పొత్తులపై సమాధానం.. అవసరమైతే ఒవైసీతోనూ

గతంలో నాగేశ్వర్‌రావుతో జరిగిన ఒక చర్చను లేదా ఉదంతాన్ని ఈ సందర్భంగా సోము వీర్రాజు గుర్తుచేశారు. “జమ్మూ కాశ్మీర్‌లో పీడీపీ (PDP) పార్టీతో బీజేపీ ఎందుకు పొత్తు పెట్టుకుంది? అని నాగేశ్వర్ రావు గతంలో నన్ను ప్రశ్నించారు. దానికి నేను స్పష్టంగా సమాధానం ఇచ్చాను. రాజకీయ వ్యూహాల్లో భాగంగా, దేశ ప్రయోజనాల కోసం అవసరమైతే మేము ఒవైసీ (AIMIM) తో కూడా పొత్తు పెట్టుకుంటామని ఆయన మొహం మీదే చెప్పాను” అని సోము వీర్రాజు స్పష్టం చేశారు. రాజకీయ సమీకరణాలను అర్థం చేసుకోకుండా కేవలం విమర్శల కోసమే నాగేశ్వర్ రావు మాట్లాడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read also:

రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ సంక్షేమ కార్డు - సీఎం రేవంత్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha