PM Modi Hyderabad Visit: హైదరాబాద్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ అందరినీ ఆశ్చర్యపరుస్తూ జూబ్లీహిల్స్‌లోని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లారు.
ఇటీవల సైనస్ సమస్యతో శస్త్రచికిత్స చేయించుకున్న పవన్ కళ్యాణ్‌ను ప్రధాని స్వయంగా పరామర్శించారు. సాధారణంగా ప్రధాని హోదాలో ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యక్తిగత పరామర్శలకు వెళ్లడం చాలా అరుదు, కానీ మోదీ ప్రోటోకాల్‌ను పక్కనబెట్టి మరీ పవన్ ఇంటికి వెళ్లడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు HICCలో ప్రధాని మోదీ.. రూ.9,377 కోట్ల విలువైన ఆరు ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.
Read Also:Purnachandra Sekhar: డెహ్రాడూన్‌లో ఆర్చి కూలి అనకాపల్లికి చెందిన ఆర్మీ జవాన్ మృతి
PM Modi visits Pawan Kalyan house
PM Modi Hyderabad Visit: సీఎం చంద్రబాబు నివాసంలో భేటీ
పవన్ కళ్యాణ్ నివాసం నుండి ప్రధాని మోదీ నేరుగా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాసానికి వెళ్లారు. చంద్రబాబు ప్రధానికి ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు పలు కీలక అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఏపీ అభివృద్ధి, ఎన్డీఏ కూటమి బలోపేతం వంటి అంశాలు వీరి భేటీలో ప్రధానంగా చర్చకు వచ్చినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:

