తమిళనాడు మరియు పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల ఫలితాల లెక్కింపు అత్యంత ఉత్కంఠభరితంగా సాగుతోంది. సినీ నటుడు విజయ్ స్థాపించిన 'తమిళగ వెట్రి కళగం' (TVK) పార్టీకి ఒకచోట సానుకూల పవనాలు వీస్తుంటే, మరోచోట నిరాశే ఎదురవుతోంది.
కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో టీవీకే విజయ్ పార్టీకి ఆశించిన స్థాయిలో ఫలితాలు రావడం లేదు. ఇప్పటివరకు జరిగిన పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో విజయ్ అభ్యర్థులు ఒక్క నియోజకవర్గంలో కూడా ఆధిక్యత కనబర్చలేకపోవడం రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. పుదుచ్చేరి ఓటర్లు ప్రయోగాత్మక రాజకీయాల కంటే అనుభవజ్ఞులైన కూటములకే మొగ్గు చూపినట్లు ప్రారంభ ట్రెండ్స్ సూచిస్తున్నాయి. ఇక్కడ విజయ్ పార్టీ తన ఉనికిని చాటుకోవడానికి తీవ్రంగా శ్రమిస్తోంది.
Read Also : విమానం నుంచి దూకేసిన ప్రయాణికుడు.. అసలేం జరిగిందంటే?
TVK Vijayఎన్డీయే దూకుడు.. కాంగ్రెస్ కూటమి వెనుకంజ
పుదుచ్చేరి అసెంబ్లీలోని మొత్తం 30 స్థానాలకు గాను ప్రస్తుతం ఎన్డీయే (NDA) కూటమి ఏకంగా 22 చోట్ల స్పష్టమైన ఆధిక్యంలో కొనసాగుతోంది. ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించి ఎన్డీయే మ్యాజిక్ ఫిగర్ (16) వైపు వేగంగా దూసుకుపోతుండగా, ప్రతిపక్ష కాంగ్రెస్ కూటమి కేవలం 6 స్థానాలకే పరిమితమైంది. ఇతర అభ్యర్థులు మరో 2 చోట్ల ముందంజలో ఉన్నారు. ఈ గణాంకాలను బట్టి చూస్తే పుదుచ్చేరిలో మరోసారి ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది.
తమిళనాడులో విజయ్ అనూహ్య ఆధిక్యం
పుదుచ్చేరిలో ఎదురుదెబ్బ తగిలినప్పటికీ, తమిళనాడులో మాత్రం విజయ్ తన సత్తా చాటుతున్నారు. అక్కడ టీవీకే పార్టీ అనూహ్యంగా 35 నియోజకవర్గాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండటం గమనార్హం. ద్రావిడ దిగ్గజాలైన డీఎంకే, అన్నాడీఎంకేల మధ్య జరుగుతున్న భీకర పోరులో విజయ్ మూడో శక్తిగా ఎదగడం విశేషం. స్టార్ పవర్ తో పాటు యువత మద్దతు విజయ్‌కు బాగా కలిసి వచ్చినట్లు కనిపిస్తోంది. మరికొద్ది గంటల్లో ఈవీఎంల లెక్కింపు పూర్తయితే కానీ విజయ్ అసలైన బలం ఎంతో పూర్తిస్థాయిలో స్పష్టత రాదు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

