TVK Vijay : తమిళనాడు ముఖ్యమంత్రి, స్టార్ హీరో, 'తమిళగ వెట్రి కజగం' (TVK) పార్టీ అధినేత విజయ్‌పై అక్కడి అభిమానులు ఏ స్థాయి ఆరాధన భావాన్ని కలిగి ఉంటారో చాటిచెప్పే ఒక వినూత్న ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో (SM) హల్‌చల్ చేస్తోంది.
తిరుచ్చికి చెందిన సుకుమార్ షణ్ముగం అనే తీవ్రమైన టీవీకే పార్టీ కార్యకర్త, తన ఇంట్లోని దేవుడి పూజా మందిరంలో ఏకంగా ముఖ్యమంత్రి విజయ్ బొమ్మ (చిన్న విగ్రహం) ను ప్రతిష్టించాడు. దేవుళ్ల పటాల మధ్యే విజయ్ విగ్రహాన్ని ఉంచి, ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం సాధారణ దేవుళ్లకు చేసినట్లే ధూపదీప నైవేద్యాలు సమర్పిస్తూ, కర్పూర హారతి ఇస్తున్నాడు. దీనికి సంబంధించిన వీడియో కాస్తా ఇంటర్నెట్‌లో అప్‌లోడ్ అవ్వడంతో క్షణాల్లో వైరల్‌గా మారింది. విజయ్ సైన్యం మరియు అభిమానులు ఈ వీడియోను చూసి ఫిదా అవుతూ తమ ‘తలైవా’ పై ఉన్న భక్తిని చాటుకుంటుండగా, సాధారణ నెటిజన్లు మాత్రం దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
Read Also ; మమతకు భారీ షాక్?.. చీలిక దిశగా తృణమూల్ కాంగ్రెస్!
TVK Vijayదేవుళ్లుగా సినీ తారలు.. తమిళనాడులో పునరావృతమవుతున్న సంస్కృతి
ఒక సామాన్య రాజకీయ నాయకుడిని లేదా సినిమా నటుడిని ఇలా దేవుడితో సమానంగా పూజా గదిలో పెట్టి పూజించడమేంటని, ఇది ముమ్మాటికీ అనాగరికత అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. అయితే, తమిళనాడు రాజకీయ, సాంస్కృతిక చరిత్రను పరిశీలిస్తే ఇలాంటి ఘటనలు కొత్తేమీ కాదని విశ్లేషకులు చెప్తున్నారు. అక్కడ సినీ రంగం, రాజకీయాలు ఒకదానితో ఒకటి పెనవేసుకుపోయి ఉంటాయి. గతంలో తమిళ ప్రజలు తమకు నచ్చిన నటీనటులపై విపరీతమైన అభిమానంతో గుడులు కూడా కట్టిన దాఖలాలు ఉన్నాయి. సీనియర్ నటి ఖుష్బుతో పాటు నమిత, హన్సిక వంటి హీరోయిన్లకు కూడా అభిమానులు ఆలయాలు నిర్మించి ఆరాధించారు. ఇప్పుడు అదే కోవలో ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించిన విజయ్‌ను కూడా ఒక దేవుడిలా భావిస్తూ పూజా మందిరాల్లో స్థానం కల్పించడం తమిళనాడులోని విలక్షణమైన ‘ఫ్యాన్ కల్చర్’ కు అద్దం పడుతోంది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

