Skin cancer symptoms: శరీరంపై ఉన్న పుట్టుమచ్చల్లో వచ్చే మార్పులను అస్సలు నిర్లక్ష్యం చేయకండి. ఇది మెలనోమా స్కిన్ క్యాన్సర్ అయ్యే అవకాశం ఉంది.
ప్రపంచవ్యాప్తంగా చర్మ క్యాన్సర్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. అతిగా సూర్యరశ్మికి గురికావడం, అతినీలలోహిత కిరణాల ప్రభావం దీనికి ప్రధాన కారణం. ప్రాథమిక దశలో గుర్తిస్తే ఈ వ్యాధిని సులభంగా నయం చేయవచ్చు. అందుకే పుట్టుమచ్చల్లో వచ్చే మార్పుల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి.
Read also: Water Bottle: ఏ వాటర్ బాటిల్ వాడితే మంచిది..?
Melanoma skin cancer early warning
ఏబీసీడీఈ సూత్రంతో క్యాన్సర్‌ను గుర్తించండి
- ఏ (Asymmetry): పుట్టుమచ్చను రెండుగా విభజిస్తే రెండు వైపులా సమానంగా ఉండదు.
- బీ (Border): పుట్టుమచ్చ అంచులు వంకరటింకరగా లేదా అస్పష్టంగా ఉంటాయి.
- సీ (Colour): పుట్టుమచ్చలో నలుపు, ఎరుపు, నీలం వంటి వివిధ రంగులు కనిపిస్తాయి.
- డీ (Diameter): సాధారణంగా 6 మిల్లీమీటర్ల కంటే పెద్దవిగా ఉండే మచ్చలు ప్రమాదకరం.
- ఈ (Evolving): పుట్టుమచ్చ పరిమాణం పెరగడం, రంగు మారడం, దురద లేదా రక్తం రావడం వంటివి జరుగుతాయి.
Skin cancer symptoms: అగ్లీ డక్లింగ్ సంకేతం జాగ్రత్త
శరీరంపై ఉన్న అన్ని పుట్టుమచ్చల కంటే భిన్నంగా, వింతగా కనిపించే మచ్చను అగ్లీ డక్లింగ్ సంకేతం అంటారు. ఇలాంటి మచ్చ కనిపిస్తే వెంటనే డెర్మటాలజిస్టును సంప్రదించాలి. మెలనోమా కేవలం ఎండ తగిలే చోటే కాదు, అరికాళ్లు, అరిచేతులు, గోళ్ల కింద కూడా వచ్చే అవకాశం ఉంది. 20 ఏళ్లు దాటిన తర్వాత కొత్తగా పుట్టుమచ్చలు వచ్చినా లేదా పాత మచ్చల్లో మార్పులు వచ్చినా జాగ్రత్త వహించాలి.
రక్షణ చర్యలు ఇలా తీసుకోండి
ప్రతి నెలా మీ చర్మాన్ని మీరే పరీక్షించుకోవడం మంచి అలవాటు. ఎండలోకి వెళ్ళినప్పుడు కనీసం ఎస్‌పీఎఫ్ 30 ఉన్న సన్‌స్క్రీన్‌ను తప్పనిసరిగా వాడాలి. శరీరాన్ని కప్పేలా దుస్తులు ధరించడం ద్వారా సూర్యరశ్మి నుంచి రక్షణ పొందవచ్చు. ఎవరికైనా చర్మ క్యాన్సర్ లక్షణాలు అనిపిస్తే, డాక్టర్ సలహాతో బయాప్సీ పరీక్ష చేయించుకోవడం ద్వారా క్యాన్సర్ అవునా కాదా అనేది స్పష్టంగా తెలుస్తుంది.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:

