Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
'ప్యారడైజ్'లో శంకరన్న పాత్రపై కేటీఆర్ ప్రశంసలు.. ప్రియదర్శి ఆసక్తికర వ్యాఖ్యలు

'ప్యారడైజ్'లో శంకరన్న పాత్రపై కేటీఆర్ ప్రశంసలు.. ప్రియదర్శి ఆసక్తికర వ్యాఖ్యలు

వార్త 3 weeks ago

Priyadarshi: తాజాగా విడుదలైన 'ప్యారడైజ్' సినిమాపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన ఆశ్చర్యాన్ని, అభినందనలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.

అణచివేతపై తిరుగుబాటు, ఆత్మగౌరవ పోరాటం నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్ర దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో పాటు, హీరో నాని, కీలక పాత్ర పోషించిన నటుడు ప్రియదర్శిలను కేటీఆర్ ప్రత్యేకంగా అభినందించారు.

ప్రియదర్శి భావోద్వేగ రిప్లై

కేటీఆర్ ప్రశంసలపై నటుడు ప్రియదర్శి ఎంతో ఆనందంగా స్పందించారు. ‘పెళ్లిచూపులు’ చిత్రం నుంచి ఇప్పటివరకు తన ప్రయాణాన్ని, ప్రతి సినిమాను ఆదరిస్తూ వస్తున్నందుకు కేటీఆర్‌కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. “మీరు చూపుతున్న ప్రేమకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, ఎప్పటికీ రుణపడి ఉంటాను రామన్నా” అంటూ ఎక్స్ వేదికగా ప్రియదర్శి భావోద్వేగ రిప్లై ఇచ్చారు.

Priyadarshi: ‘శంకరన్న’ పాత్ర చుట్టూ రాజకీయ చర్చ

ఈ చిత్రంలో ప్రియదర్శి పోషించిన ‘ఎమ్మెల్యే శంకరన్న’ పాత్ర ప్రస్తుతం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ పాత్ర హావభావాలు, ఆహార్యం తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను పోలి ఉన్నాయంటూ సోషల్ మీడియాలో పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. అయితే ఇది పూర్తిగా కల్పిత కథ అని దర్శకుడు స్పష్టం చేసినప్పటికీ, కేటీఆర్ ఈ పాత్రను ప్రత్యేకంగా ప్రశంసించడం సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha