Pat Cummins Fitness Update: ఐపీఎల్ 2026 సీజన్ ఆరంభానికి సిద్ధమవుతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఊహించని వార్త అందింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)తో జరగనున్న తొలి మ్యాచ్‌కు ముందే జట్టు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అందుబాటుపై సందిగ్ధత నెలకొంది.
ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న హెడ్ కోచ్ డేనియల్ వెటోరీ, కమిన్స్ ప్రస్తుత ఫిట్‌నెస్ స్థితిగతులపై కీలక సమాచారాన్ని పంచుకున్నారు.
Read Also:RCB vs SRH Today Match: నేడే ఆర్‌సీబీ vs ఎస్‌ఆర్‌హెచ్ పోరు
క్రికెట్ ఆస్ట్రేలియా నుంచి రాని ఎన్ఓసీ (NOC)
ప్యాట్ కమిన్స్ ఫిట్‌నెస్ విషయంలో క్రికెట్ ఆస్ట్రేలియా (CA) నుండి ఇంకా పూర్తి స్థాయి క్లియరెన్స్ రాలేదని వెటోరీ వెల్లడించారు. కమిన్స్ సాధారణంగా ఫిట్‌గానే ఉన్నప్పటికీ, మ్యాచ్ బౌలింగ్ లోడ్స్‌ను తట్టుకునేందుకు అతని శరీరం ఇంకా సిద్ధం కాలేదని ఆయన పేర్కొన్నారు. దీనివల్ల ఐపీఎల్ బరిలోకి దిగడానికి కమిన్స్‌కు మరికొన్ని రోజులు నిరీక్షణ తప్పదు.
Pat Cummins Fitness Update IPL 2026
వెటోరీ అంచనా: మరో 10 నుండి 12 రోజులు పట్టవచ్చు
కమిన్స్ తిరిగి జట్టులోకి చేరడానికి కనీసం 10 నుండి 12 రోజుల సమయం పడుతుందని వెటోరీ అంచనా వేస్తున్నారు. “కమిన్స్ చాలా కాలంగా ఆటకు దూరంగా ఉండటంతో స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్‌పై దృష్టి సారించాడు. ఇప్పుడు ప్రధాన సవాలు బౌలింగ్ లోడ్స్ పెంచడమే. బౌలింగ్ రీస్టార్ట్ చేయడం ఒక కష్టమైన ప్రక్రియ, అందుకే రిస్క్ తీసుకోదలచుకోలేదు” అని వెటోరీ వివరించారు.
కమిన్స్ దూరమవ్వడంతో ఇషాన్ కిషన్‌కి కెప్టెన్సీ అప్పగించామని.. సారథ్య బాధ్యతలు తీసుకోవడంలో ఇషాన్ చాలా ఎగ్జయిట్‌గా ఉన్నాడని వెటోరీ తెలిపాడు. ఇషాన్ కిషన్‌పై నమ్మకం ఉందని.. అదేవిధంగా కమిన్స్ లేకపోయినా జట్టులో అందుకు తగ్గ రీప్లేస్‌మెంట్‌లు ఉన్నాయంటూ వెటోరీ వివరించాడు. కమిన్స్ గ్రౌండ్‌లోకి రాకపోయినా.. ఎప్పటికప్పుడు గైడెన్స్ ఇస్తాడని క్లారిటీ ఇచ్చాడు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:

