Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రాధా గాయత్రి మృతి కేసు: భర్తపై హత్య కేసు నమోదు

రాధా గాయత్రి మృతి కేసు: భర్తపై హత్య కేసు నమోదు

వార్త 1 week ago

Radha Gayatri Death Case: ఉత్తరాఖండ్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం ముస్సోరీలో తెలుగు సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని రాధా గాయత్రి మృతి చెందిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టించింది.

తొలుత సాధారణ మరణంగా భావించినప్పటికీ, ఆమె తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో ఈ కేసు ఊహించని మలుపు తిరిగింది. ప్రస్తుతం ఆమె భర్త శ్రీచరణ్‌పై పోలీసులు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తును ముమ్మరం చేశారు. విశాఖపట్నానికి చెందిన రాధా గాయత్రి గురుగ్రామ్‌లో ఐటీ ఉద్యోగిగా పనిచేస్తుండగా, ఆమె భర్త శ్రీచరణ్ పూణెలో ఉద్యోగం చేస్తున్నారు. గతేడాది నవంబర్ 8న వీరి వివాహం జరిగింది. జూన్ 14న శ్రీచరణ్ పుట్టినరోజును జరుపుకోవడానికి ఈ జంట ముస్సోరీ-ధనోల్టి రోడ్డులోని ‘కియానా హోమ్‌స్టే’కు చేరుకున్నారు.జూన్ 14 రాత్రి ఇద్దరం కలిసి మద్యం సేవించి రాత్రి 3:30 గంటల ప్రాంతంలో నిద్రపోయామని భర్త తెలిపాడు. జూన్ 15 ఉదయం లేచి చూసేసరికి భార్య స్పృహ లేకుండా పడి ఉందని, ముక్కు నుండి రక్తం కారుతోందని పేర్కొన్నాడు. పోలీసులు హోటల్ గదిని పరిశీలించగా, రాధా గాయత్రి మృతదేహం దుస్తులు లేకుండా, మూత్రంతో తడిసి ఉంది. మంచంపై రక్తపు మరకలు ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. అలాగే గదిలో ఖాళీ మద్యం సీసాలు, కొన్ని మందుల స్ట్రిప్స్ లభించాయి.

Read Also: Telangana Road accidents : రెండు కుటుంబాలను బలితీసుకున్న రోడ్డు ప్రమాదాలు!

 Radha Gayatri Death Case

తండ్రి ఫిర్యాదులో సంచలన ఆరోపణలు

రాధా గాయత్రి తండ్రి, రిటైర్డ్ ఆర్మీ అధికారి సుధాకర్, అల్లుడు శ్రీచరణ్‌పై తీవ్ర ఆరోపణలు చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన లేవనెత్తిన అనుమానాలు ఇవే. దంపతులు హరిద్వార్, రిషికేశ్ యాత్రకు వెళ్తున్నట్లు మాత్రమే తమకు చెప్పారని, ముస్సోరీ వెళ్తున్న విషయాన్ని దాచారని తండ్రి ఆరోపించారు. శ్రీచరణ్ తన కుమార్తెను మానసికంగా హింసించేవాడని, మరణానికి దారితీసే మందులు ఏవైనా ఇచ్చి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు.రాత్రి జూన్ 15 తెల్లవారుజామున 1:36 నుండి 1:38 గంటల మధ్యలో వచ్చిన సెల్ఫీ మెసేజ్ కూడా అనుమానాస్పదంగా ఉందని, బంగీ జంపింగ్ చేశామని చెప్పినా దానికి సంబంధించిన ఫోటోలు లేవని పేర్కొన్నారు. రాధా గాయత్రికి లో-బీపీ సమస్య ఉందని, అయితే ఆమెకు మద్యం సేవించే అలవాటు అస్సలు లేదని తల్లిదండ్రులు బలంగా వాదిస్తున్నారు. హ్రాడూన్‌లోని కొరోనేషన్ హాస్పిటల్‌లో రాధా గాయత్రి మృతదేహానికి వీడియో గ్రాఫింగ్ ద్వారా పోస్ట్‌మార్టం నిర్వహించారు. ప్రాథమిక నివేదికలో శరీరంపై ఎలాంటి బాహ్య గాయాలు కనిపించలేదు. మరణానికి గల ఖచ్చితమైన కారణాన్ని తెలుసుకోవడానికి అంతర్గత అవయవాలను (Viscera) టాక్సికాలజికల్ పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపారు. ముస్సోరీ పోలీసులు హోటల్‌లోని సీసీటీవీ ఫుటేజ్, ఇద్దరి మొబైల్ ఫోన్ డేటాను విశ్లేషిస్తున్నారు. ఈ కేసు దర్యాప్తు కోసం ఉత్తరాఖండ్ పోలీసులు ఢిల్లీ, విశాఖపట్నం పోలీసులతో సమన్వయం చేసుకుంటున్నారు.

Radha Gayatri Death Case: నిందితుడి స్పందన

మరోవైపు భర్త శ్రీచరణ్ తనపై వచ్చిన ఆరోపణలను తిరస్కరించారు. తామిద్దరం ఇష్టపడే పెళ్లి చేసుకున్నామని, తాను ఎలాంటి తప్పు చేయలేదని మీడియాకు తెలిపారు. పోలీసు విచారణకు పూర్తి సహకారం అందిస్తున్నానని, హోటల్ ప్యాకేజీలోనే మద్యం భాగమని, పోస్ట్‌మార్టం విసెరా నివేదిక వస్తే అసలు నిజాలు బయటపడతాయని ఆయన పేర్కొన్నారు. ఈ ఘటన యువ జంటల భద్రత మరియు ప్రయాణాల సమయంలో కుటుంబాలతో కమ్యూనికేషన్‌లో ఉండాల్సిన ప్రాధాన్యతను మరోసారి గుర్తు చేస్తోంది.

Epaper: epaper.vaartha.com

విధి నిర్వహణలో రవాణా అధికారి వెంకన్న మృతి.. తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మంత్రి పొన్నం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha