Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రాఘవ్ చద్దా బీజేపీ చేరిక: పాత ట్వీట్‌ను వైరల్ చేసిన రఘురాం రాజన్

రాఘవ్ చద్దా బీజేపీ చేరిక: పాత ట్వీట్‌ను వైరల్ చేసిన రఘురాం రాజన్

వార్త 2 months ago

Raghav Chadha: పంజాబ్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తూ, పార్లమెంట్‌లో తన గళంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రాఘవ్ చద్దా రాజకీయ ప్రయాణం అనూహ్య మలుపు తిరిగింది.

ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)లో కీలక నేతగా ఉన్న ఆయన, ఆ పార్టీని వీడి భారతీయ జనతా పార్టీ (BJP)లో చేరిన విషయం తెలిసిందే, గతంలో కేజ్రీవాల్‌కు అత్యంత సన్నిహితుడిగా ఉండి, ఇప్పుడు అదే పార్టీపై విమర్శలు చేస్తూ బీజేపీ గూటికి చేరడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.

Read Also:Foreign tourist india : ఇండియాపై విదేశీ యువతి పోస్ట్.. షాక్ అనుభవాలు

Raghav Chadha: 28 రోజుల రీఛార్జ్ ప్రశ్న.. సామాన్యుల ఎంపీగా గుర్తింపు

రాఘవ్ చద్దా మొబైల్ ఆపరేటర్ల ప్రీపెయిడ్ ప్లాన్ల (28 రోజులు) గురించి పార్లమెంట్‌లో అడిగిన ప్రశ్నలు ఆయనకు దేశవ్యాప్తంగా క్రేజ్ తెచ్చిపెట్టాయి. సామాన్యుల సమస్యలను ప్రస్తావిస్తున్న ఎంపీగా ఆయన ఇమేజ్ పెరిగింది. అయితే, ఇదంతా ఒక వ్యూహం ప్రకారమే జరిగిందా? అన్న సందేహాలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి. ప్రజల పక్షాన అడిగిన ప్రశ్నలను బీజేపీ పరోక్షంగా వైరల్ చేయడం, ఇప్పుడు ఆయన అదే పార్టీలో చేరడం వెనుక పెద్ద రాజకీయ స్కెచ్ ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

వైరల్ అవుతున్న 'కాకి' పోస్ట్.. రఘురాం రాజన్ రీపోస్ట్

రాఘవ్ చద్దా బీజేపీలో చేరిన తరుణంలో, 2023లో ఢిల్లీ బీజేపీ ఆయనపై చేసిన ఒక పాత పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పార్లమెంట్ నుంచి వస్తున్న రాఘవ్‌ను కాకి పొడిచిన ఫోటోను షేర్ చేస్తూ.. “అబద్ధాలకోరును కాకి పొడిచింది” అంటూ అప్పట్లో బీజేపీ ఎద్దేవా చేసింది. విశేషం ఏమిటంటే, ఈ పోస్ట్‌ను ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ ఎక్స్‌ (ట్విట్టర్)లో రీపోస్ట్ చేయడంతో ఇది మరింత హాట్ టాపిక్‌గా మారింది.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

అట్టర్ ఫ్లాప్ అయిన ట్రంప్ 'గోల్డ్ కార్డ్' ప్లాన్!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha