Dailyhunt
రాహా 'నటి' కాకూడదు.. అథ్లెట్ కావాలి: అలియా భట్

రాహా 'నటి' కాకూడదు.. అథ్లెట్ కావాలి: అలియా భట్

వార్త 1 week ago

Alia Bhatt: బాలీవుడ్ స్టార్ కపుల్ అలియా భట్, రణబీర్ కపూర్ల ముద్దుల కుమార్తె రాహా కపూర్ భవిష్యత్తు గురించి అలియా చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సినిమా నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చినప్పటికీ, తన కుమార్తెను వెండితెరపై కంటే క్రీడా మైదానంలో చూడాలని ఆమె కోరుకుంటున్నారు.

Read Also: Maa Inti Bangaram : సమ్మర్ సమంతదేనా ?

నటన వద్దు.. క్రీడలే ముద్దు!

కపూర్ కుటుంబం అంటేనే దశాబ్దాలుగా భారతీయ సినిమాను ఏలుతున్న కుటుంబం. కానీ, అలియా భట్ మాత్రం తన కుమార్తె రాహా విషయంలో భిన్నంగా ఆలోచిస్తున్నారు.రాహా భవిష్యత్తులో ఒక గొప్ప అథ్లెట్ లేదా క్రీడాకారిణిగా ఎదగాలని, దేశం గర్వించేలా ఒలింపిక్స్‌లో పాల్గొనాలని అలియా తన మనసులోని కోరికను బయటపెట్టారు.రాహాలో ఉన్న చురుకుదనాన్ని చూసి, ఆమెకు క్రీడల పట్ల ఆసక్తిని పెంచేలా ప్రోత్సహించాలని అలియా భావిస్తున్నారు.

 Alia Bhatt wishes daughter Raha Kapoor to become an athlete

Alia Bhatt: క్రీడలపై ఆసక్తికి కారణం ఇదే

సాధారణంగా స్టార్ కిడ్స్ అందరూ తమ తల్లిదండ్రుల బాటలోనే నటన వైపు మొగ్గు చూపుతారని అందరూ భావిస్తారు. కానీ అలియా భట్ ఆలోచనలు మాత్రం వేరుగా ఉన్నాయి.”రాహా వయసు ఇప్పుడు కేవలం మూడేళ్లే. కానీ ఆమె చాలా చురుగ్గా ఉంటుంది. ఒక చోట స్థిరంగా ఉండకుండా ఎప్పుడూ గెంతుతూ, ఏదో ఒక పని చేస్తూనే ఉంటుంది” అని అలియా పేర్కొన్నారు.

రాహాలో చిన్న వయసులోనే మంచి పోటీతత్వం కనిపిస్తోందని, అందుకే ఆమె క్రీడల్లో రాణిస్తే చూడాలని అందరూ కోరుకుంటున్నట్లు అలియా వివరించారు.”ఆమె ఒక ‘బీ ఇన్ ఏ బోనెట్’ (Bee in a bonnet) లాగా ఎప్పుడూ ఉత్సాహంగా అటు ఇటు తిరుగుతూనే ఉంటుంది” అంటూ రాహా ఎనర్జీ లెవల్స్‌ను అలియా కొనియాడారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

చిన్నస్వామిలో అసలైన యుద్ధం.. ఆరెంజ్ క్యాప్ కోసం కోహ్లీ-గిల్ ఫైట్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha