Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రాహుల్ గాంధీపై విజయసాయిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

రాహుల్ గాంధీపై విజయసాయిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

వార్త 3 weeks ago

Vijayasai Reddy: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ రాజకీయ శైలిపై రాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

భారతీయ రాజకీయాల్లో రాహుల్ గాంధీ ప్రజలతో లోతుగా మమేకం కావడంలో ఎందుకు వెనుకబడుతున్నారో వివరిస్తూ సోషల్ మీడియా వేదికగా ఆయన కొన్ని విశ్లేషణలు పంచుకున్నారు.

హిందీ భాషా శైలి మరియు అనువాద ధోరణిపై విశ్లేషణ

రాహుల్ గాంధీ ఆంగ్ల భాషలో అత్యద్భుతంగా మాట్లాడగలరని, కానీ మన దేశ రాజకీయాల్లో రాణించాలంటే ప్రజలు నిత్యం మాట్లాడే స్థానిక భాషలపై గట్టి పట్టు ఉండాలని విజయసాయిరెడ్డి అభిప్రాయపడ్డారు. రాహుల్ హిందీ ప్రసంగాలు వింటుంటే ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్‌ను లేదా వేరే భాష నుంచి అనువదించి మాట్లాడుతున్న భావన కలుగుతుందని ఆయన ఎద్దేవా చేశారు.

Vijayasai Reddy: సామాన్య ప్రజలతో కనెక్ట్ కాలేకపోవడానికి అసలు కారణం

రాహుల్ హిందీలో మాట్లాడేటప్పుడు స్పష్టమైన ఇంగ్లీష్ యాస, పదాల ప్రభావం స్పష్టంగా కనిపిస్తాయని, మన దేశ మట్టి వాసన ఉట్టిపడే నుడికారాలు, జాతీయాలు ఆయన ప్రసంగాల్లో లోపిస్తాయని విమర్శించారు. ఆయన ఆంగ్లంలో ఆలోచించి దానిని హిందీలోకి అనువదించి మాట్లాడుతున్నట్లు అనిపించడం వల్లనే సామాన్య జనంతో మానసికంగా కనెక్ట్ కాలేకపోతున్నారని ఆయన కుండబద్దలు కొట్టారు.

Epaper: epaper.vaartha.com

ఎరువుల కొరతకు చెక్ పెట్టిన మోదీ సర్కార్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha