Politics : రాజకీయాల్లోకి వచ్చి గుర్తింపు తెచ్చుకోవాలనుకునే యువత నాయకుల చుట్టూ తిరగడం మానుకోవాలని ప్రభుత్వ సలహాదారు, సీనియర్ నాయకుడు వి. హనుమంతరావు (VH) స్పష్టమైన సూచన చేశారు.
నేతల వెనుక తిరగడం వల్ల ఎలాంటి రాజకీయ ప్రయోజనం ఉండదని, కేవలం సోషల్ మీడియాలో ఫొటోలు, రీల్స్ పోస్ట్ చేసుకోవడానికే అది పరిమితమవుతుందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. నాయకులకు భజన చేయడం ద్వారా స్వల్పకాలిక ప్రచారమే తప్ప సొంతంగా ఎదిగే అవకాశం రాదని ఆయన అభిప్రాయపడ్డారు. యువత తమ కాలాన్ని శ్రమను ఇతరులను ప్రసన్నం చేసుకోవడానికి వృథా చేయకుండా, రాజకీయాల్లో సొంత వ్యక్తిత్వాన్ని ఏర్పరుచుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వాలని హితవు పలికారు.

ప్రజా సమస్యలే నాయకత్వానికి పునాది: క్షేత్రస్థాయి పోరాటాలే శ్రీరామరక్ష
యువ కార్యకర్తలు నిజమైన నాయకులుగా ఎదగాలంటే తమ సొంత ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న మౌలిక సమస్యలపై దృష్టి సారించాలని విహెచ్ సూచించారు. రోడ్ల మరమ్మతులు, మంచినీటి ఎద్దడి, స్థానిక పరిపాలనా లోపాలు వంటి అంశాలపై నిలదీస్తూ ప్రజల పక్షాన పోరాటాలు చేసినప్పుడే నిజమైన ప్రజాదరణ లభిస్తుందని ఆయన స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తేనే నాయకత్వ పటిమ పెరుగుతుందని, అది మాత్రమే శాశ్వత గుర్తింపును తెచ్చిపెడుతుందని వివరించారు. ఈ తరహా ప్రజాపోరాటాలు చేసే వారికే రాజకీయాల్లో ప్రాధాన్యం దక్కుతుందని యువత గ్రహించాలని ఆయన పిలుపునిచ్చారు.
మధు యాష్కీకి కీలక బాధ్యతలు.. ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ ఛైర్మన్‌గా నియామకం

