Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రాజస్థాన్ రాయల్స్ (RR).. 11 ఓవర్లలో 150/3

రాజస్థాన్ రాయల్స్ (RR).. 11 ఓవర్లలో 150/3

వార్త 2 months ago

RR vs MI Live Score: 11 ఓవర్ల పరిమిత పోరులో రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్లు ముంబై ఇండియన్స్ బౌలర్లను ఊచకోత కోశారు. నిర్ణీత 11 ఓవర్లలో ఆర్ఆర్(RR) కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 150 పరుగులు చేసింది.

అంటే ప్రతి ఓవర్లో సగటున 13.6 పరుగులు సాధించి ముంబైకి క్లిష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించింది.

జైస్వాల్ ‘మాస్’ ఇన్నింగ్స్

ఓపెనర్ యశస్వి జైస్వాల్ మరోసారి తన సత్తా చాటాడు. కేవలం 32 బంతుల్లోనే 10 ఫోర్లు, 4 భారీ సిక్సర్లతో 77 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. జైస్వాల్‌తో పాటు 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ కూడా కేవలం 14 బంతుల్లోనే 5 సిక్సర్లతో 39 పరుగులు చేసి ముంబై బౌలర్లకు చుక్కలు చూపించాడు. వీరిద్దరూ కలిసి పవర్‌ప్లేలో జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్ వంటి దిగ్గజ బౌలర్లను కూడా వదలకుండా బౌండరీల వర్షం కురిపించారు.

RR vs MI Live Score: ముంబై బౌలర్ల తిప్పలు

ముంబై బౌలర్లలో అల్లా గజన్‌ఫర్ 2 వికెట్లు తీసి కొంచెం కట్టడి చేసినప్పటికీ, మిగిలిన బౌలర్లు ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. శార్దూల్ ఠాకూర్ 2 ఓవర్లలో 36 పరుగులు ఇవ్వగా, బుమ్రా 3 ఓవర్లలో 32 పరుగులు ఇచ్చాడు. ముంబై విజయానికి 11 ఓవర్లలో 151 పరుగులు చేయాల్సి ఉంది. గౌహతి బ్యాటింగ్ పిచ్‌పై రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా సేన ఈ లక్ష్యాన్ని ఎలా ఛేదిస్తుందో చూడాలి.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha