Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రాజస్థాన్‌పై విజయంతో రెండో స్థానానికి చేరిన గుజరాత్

రాజస్థాన్‌పై విజయంతో రెండో స్థానానికి చేరిన గుజరాత్

వార్త 2 weeks ago

Gujarat Titans: ఐపీఎల్ 2026 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ (GT) వరుస విజయాలతో దూసుకుపోతోంది. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన కీలక పోరులో గుజరాత్ 77 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది.

అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లో అదరగొట్టిన టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్‌కు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా మ్యాచ్‌ను ఏకపక్షంగా ముగించింది.ఈ ఏకపక్ష విజయంతో పాయింట్ల పట్టికలో అట్టడుగు నుంచి అగ్రస్థానానికి పోటీగా దూసుకొచ్చింది. ఈ మ్యాచ్‌కు ముందు ఐదో స్థానంలో ఉన్న గుజరాత్, ప్రస్తుతం ఏకంగా రెండో స్థానానికి ఎగబాకింది.

Read Also:IPL 2026 : నేడు కీలక మ్యాచ్ లు.. ఓడితే ఆ రెండు జట్లు ఇంటికే!

టాప్-5 జట్ల ప్రస్తుత పరిస్థితి (11 మ్యాచ్‌ల తర్వాత):

ప్రస్తుతం గుజరాత్ దూకుడుతో పట్టికలోని ఎగువ స్థానాలు తలకిందులయ్యాయి. టాప్ జట్ల వివరాలు ఇలా ఉన్నాయి. ముఖ్యంగా పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు ఒక మెట్టు కిందకు పడిపోయాయి. ఇప్పటివరకు రెండో స్థానంలో ఉన్న పంజాబ్ కింగ్స్ ఇప్పుడు మూడో స్థానానికి పరిమితమైంది. పంజాబ్ 10 మ్యాచ్‌లలో 13 పాయింట్లు కలిగి ఉంది. అలాగే, 12 పాయింట్లతో మూడో స్థానంలో ఉన్న బెంగళూరు జట్టు ఇప్పుడు నాలుగో స్థానానికి పడిపోయింది. ఈ మార్పుల వల్ల ప్లే ఆఫ్ రేసు మరింత ఉత్కంఠభరితంగా మారింది.

 IPL Playoff Race

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

సిక్సర్ల కింగ్ వైభవ్ సూర్యవంశీ.. ప్రపంచ రికార్డు బద్దలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha