Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రాజీనామాకు సిద్ధమా? రేవంత్, మంత్రులకు హరీష్ రావు సవాల్

రాజీనామాకు సిద్ధమా? రేవంత్, మంత్రులకు హరీష్ రావు సవాల్

వార్త 1 week ago

CM Revanth : బిఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ 300 ఎకరాల దళితుల భూములను కబ్జా చేశారని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ సీనియర్ నేత హరీశ్ రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని ఖండించిన ఆయన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మరియు ఆయన మంత్రులకు బహిరంగ సవాల్ విసిరారు. “కేసీఆర్ వద్ద 300 ఎకరాల దళితుల భూమి దేవుడెరుగు.. కనీసం 3 ఎకరాలు కూడా కబ్జా కాలేదని రుజువైతే సీఎం, ఆయన మంత్రులు తమ పదవులకు రాజీనామా చేస్తారా?” అని సూటిగా ప్రశ్నించారు. ఒకవేళ కేసీఆర్ వద్ద నిజంగానే ఒక్క సెంట్ దళితుల భూమి ఉన్నట్లు నిరూపిస్తే తామంతా రాజకీయాల నుంచి తప్పుకోవడానికి లేదా రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.

బురద రాజకీయంపై విమర్శలు - కాంగ్రెస్ వైఫల్యాల కప్పిపుచ్చే యత్నం

రాష్ట్రంలో అసలైన ప్రజా సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే కాంగ్రెస్ సర్కార్ ఇటువంటి బురద రాజకీయాలకు తెరలేపిందని హరీశ్ రావు మండిపడ్డారు. హామీల అమలులో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం, తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి బీఆర్‌ఎస్ నాయకులపై అసత్య ఆరోపణలు చేస్తోందని ధ్వజమెత్తారు. అసెంబ్లీలో కానీ, బయట కానీ ప్రజా సమస్యలపై చర్చ జరగకుండా ఉండేందుకే ఉద్దేశపూర్వకంగా ఇటువంటి వివాదాలను సృష్టిస్తున్నారని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికైనా చౌకబారు ఆరోపణలు స్వస్తి చెప్పి, ఇచ్చిన హామీల అమలుపై దృష్టి సారించాలని డిమాండ్ చేశారు.

సింగరేణి కార్మికులకు ఇళ్ల పట్టాలు: మంత్రి పొంగులేటి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha