Rakasa Movie Trailer Release: సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటించిన తాజా చిత్రం 'రాకాస'. ఈ చిత్రానికి మానస శర్మ దర్శకత్వం వహించగా, మెగా డాటర్ నిహారిక కొణిదెల తన 'పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్' బ్యానర్‌పై ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.
ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, సాంగ్స్ (స్నేక్ డ్యాన్స్, రాపప్ప) సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేయగా, తాజాగా మేకర్స్ ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు.
Read Also:Chinmayi Comments on Yash Dayal: RCB బౌలర్ వివాదంపై గాయని చిన్మయి సంచలన వ్యాఖ్యలు
Rakasa Movie Trailer Release: భయం.. ఫాంటసీ.. మరిన్ని నవ్వులు!
సుమారు 2 నిమిషాలకు పైగా ఉన్న ఈ ట్రైలర్ ప్రేక్షకులను థ్రిల్ చేస్తూనే నవ్వులు పూయిస్తోంది. ఒక మారుమూల గ్రామంలో భయంకరమైన 'బ్రహ్మరాక్షసుడి'కి బలి ఇచ్చే ఆచారం చుట్టూ కథ తిరుగుతున్నట్లు ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతోంది. హారర్, ఫాంటసీ అంశాలను మిక్స్ చేస్తూ, దానికి సంగీత్ శోభన్ మార్కు కామెడీని జోడించడం సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. ముఖ్యంగా దెయ్యాలకు భయపడుతూ సంగీత్ చేసే కామెడీ టైమింగ్ అద్భుతంగా ఉంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:

