Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

Raakasa Movie: సంగీత్ శోభన్ 'రాకాస' గ్లింప్స్ విడుదల

వార్త 4 months ago
Raakasa Movie: సంగీత్ శోభన్ 'రాకాస' గ్లింప్స్ విడుదల

'కమిటీ కుర్రోళ్లు' వంటి చిత్రం తర్వాత, నిర్మాతగా నిహారిక కొణిదెల మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌తో ముందుకు వస్తున్నారు.

ఆమె నిర్మాణ సంస్థ 'పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్' బ్యానర్‌పై యువ హీరో సంగీత్ శోభన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న తాజా చిత్రం 'రాకాస' (Raakasa Movie). ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్‌ను తాజాగా చిత్ర యూనిట్ విడుదల చేయగా, ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది.

Movie: రవితేజ సినిమాలో విలన్ గా ఎస్‌జే సూర్య?

మంచి స్పందన

ఈ గ్లింప్స్ ప్రారంభంలో ఎంతో గంభీరంగా సాగుతూ.. యుగయుగాలుగా ప్రతీ కథలోనూ ఒక సమస్య ఉంటుందని, దాన్ని పరిష్కరించేందుకు ఒక వీరుడు పుడతాడని, ఆ వీరుడు తనేనంటూ హీరో ఇచ్చే ఎలివేషన్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతుంది. అయితే వెంటనే కథలో కామెడీ, సెటైరికల్ ట్విస్ట్ మొదలై ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తుతుంది.

సంగీత్ శోభన్ తనదైన కామెడీ టైమింగ్‌తో మరోసారి మెప్పించనున్నట్లు ఈ గ్లింప్స్ ద్వారా అర్థమవుతోంది. నయన్ సారిక హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి అనుదీప్ దేవ్ సంగీతం అందిస్తున్నారు. నిహారిక కొణిదెలతో కలిసి ఉమేష్‌కుమార్ బన్సల్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ క్రేజీ ఎంటర్టైనర్ ఏప్రిల్ 3న థియేటర్లలో విడుదల కానుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Roshan: ఈ నెల 29న OTTలోకి 'ఛాంపియన్'

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha