Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రాఖీకి ప్రత్యేక ఆఫర్లతో డిమార్ట్ కు క్యూ కడుతున్న మహిళలు

రాఖీకి ప్రత్యేక ఆఫర్లతో డిమార్ట్ కు క్యూ కడుతున్న మహిళలు

వార్త 21 hrs ago

D Mart : ఇంట్లో పప్పులు నిండుకున్నాయి.. డీ మార్ట్ వెళ్లాలి. ఇంట్లో వంట నూనె దగ్గర పడింది డీ మార్ట్ కు వెళ్లాలి. ఇలా పేద, మధ్యతరగతి ప్రజలు ఎక్కువ మాట్లాడుకుంటారు.

ఎందుకంటే డీమార్ట్ వీరినే టార్గెట్ చేసింది. తక్కువ ధరలో నిత్యావసర వస్తువులు, గృహోపకరణాలు అందిస్తున్న డీమార్ట్ తక్కవ కాలంలో బహుళ ప్రాచుర్యం పొందింది. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడతో పాటు చాలా పట్టణాల్లో డీ మార్ట్ స్టోర్లు అందుబాటులోకి వచ్చాయి. ఎప్పుడు వెళ్లిన డీమార్ట్ స్టోర్లు రద్దీగా కనిపిస్తాయి. జనాలకు అన్ని వస్తువులు ఒకే చోట దొరకడం, తక్కువ ధర ఉండడం వల్ల డీమార్ట్ వెళ్తున్నారని చెబుతున్నారు. రాఖీ పండుగా సందర్భంగా డీమార్ట్ స్పెషల్ స్వీట్లు, రాఖీలు అందుబాటులోకి తెచ్చినట్లు తెలుస్తోంది. స్టోర్ లో రాఖీలకు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేశారు. ఈ విభాగంలో ఆకర్షణీయమైన రాఖీలు, రకరకాల డిజైన్ల రాఖీలు అందుబాటులోకి తెచ్చారు. కార్టూన్ థీమ్ రాఖీలు కూడా ఉన్నాయి.

Read Also: KCC : ఇక వారికీ కూడా కిసాన్ క్రెడిట్ కార్డులు

 D Mart

D Mart: వరలక్ష్మి వ్రతంకు సంబంధించిన పూజా సామాగ్రి కొనుగోలు

అంతే కాకుండా ఈ నెలలో వరలక్ష్మి వ్రతం ఇందుకు సంబంధించిన పూజా సామాగ్రి కూడా కొనుగోలు చేస్తున్నారు. కాగా మొట్టమొదటి డీ మార్ట్ స్టోర్ ను ఓనర్ రాధా కిషన్ దమానీ ముంబైలో 2002 లో ప్రారంభించారు. కంపెనీ 2024-25 ఆర్థిక సంవత్సరంలో 10 రాష్ట్రాలలో 415 స్టోర్లను నిర్వహిస్తూ, రూ.57,790 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. రాధా కిషన్ దమానీ మొదటి సూత్రం తక్కువ ఖర్చుతో స్టోర్లు ఏర్పాటు చేయడం. అందుకే ఏ డిమార్ట్ స్టోర్‌లోకి అడుగుపెట్టినా మెరిసే మార్బుల్ ఫ్లోర్లు ఉండవు, ఫ్యాన్సీ డిజైనర్ ఫిక్చర్లు ఉండవు, లైటింగ్ చాలా సాదాసీదాగా ఉంటుంది. ఫ్యూచర్ గ్రూప్‌కు చెందిన బిగ్ బజార్ వంటి ప్రత్యర్థులు ఖరీదైన మాల్స్‌లో దీర్ఘకాలిక లీజులను ఎంచుకోగా, దమానీ భిన్నమైన మార్గాన్ని ఎంచుకున్నారు. డిమార్ట్ తన స్టోర్లను చాలా వరకు సొంత భవనాల్లోనే ఏర్పాటు చేశారు.

RAC ప్రయాణికులకు ప్రత్యేక బెడ్‌రోల్స్‌..!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha