Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
'రామాయణ్' విమర్శలపై హృతిక్ రోషన్ ఫైర్

'రామాయణ్' విమర్శలపై హృతిక్ రోషన్ ఫైర్

వార్త 2 months ago

Ramayana Movie VFX Controversy: దర్శకుడు నితేష్ తివారీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న పౌరాణిక చిత్రం 'రామాయణ్' (Ramayana) ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.

రణబీర్ కపూర్ శ్రీరాముడిగా నటిస్తున్న ఈ చిత్ర గ్లింప్స్ విడుదలైనప్పటి నుండి విజువల్ ఎఫెక్ట్స్ (VFX) పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కొందరు విమర్శిస్తున్న తరుణంలో, బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్ ఈ చిత్రానికి మద్దతుగా నిలిచారు.

Read Also:Patriot Trailer Release: ఇద్దరు సూపర్ స్టార్ల విశ్వరూపం..'పేట్రియాట్' ట్రైలర్ రిలీజ్

Ramayana Movie VFX Controversy: హృతిక్ రోషన్ ఏమన్నారంటే?

హృతిక్ రోషన్ తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఒక పోస్ట్‌ను షేర్ చేశారు. "ఒక భారీ సినిమాను రూపొందించే క్రమంలో నిర్మాతల ఉద్దేశం ప్రశంసించాలి. కల్కి 2898 AD, బాహుబలి, ఇప్పుడు రామాయణం వంటి సినిమాలను తీస్తున్న వారు నా దృష్టిలో అసలైన హీరోలు అని హృతిక్ రోషన్ రాసుకొచ్చాడు. అలాగే ఈ దర్శకులంతా ఎవరూ చేయని సాహసాన్ని చేస్తున్నారు" అని హృతిక్ పేర్కొన్నారు.

సినిమాలోని వీఎఫ్ఎక్స్ పై వచ్చిన విమర్శలకు కౌంటర్ ఇస్తూ.. " వీఎఫ్ఎక్స్ అంటే కేవలం వాస్తవానికి దగ్గరగా ఉండటమే కాదు, ఒక్కో దర్శకుడు ఒక్కో శైలిని ఎంచుకుంటారు. కొన్నిసార్లు అది 'స్టోరీ బుక్' తరహాలో ఉండవచ్చు. ఎన్నో వందల మంది సినిమాల కోసం కష్టపడుతూ ఉంటారు. వారి శ్రమను తక్కువ చేసి చూడకూడదు. "ఇది నిజంగా కనిపిస్తుందా?" అని అడిగే బదులు, "ఇది ఆ కథా ప్రపంచానికి సరిపోతుందా?" అని ఆలోచించాలని అంటూ హృతిక్ రోషన్ రాసుకొచ్చాడు.ప్రస్తుతం హృతిక్ చేసిన ఈ వ్యాఖ్యలు బాలీవుడ్‌తో పాటు సౌత్ ఇండస్ట్రీలోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

మేఘాంశ్ శ్రీహరి కొత్త సినిమా ప్రారంభం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha