Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రామప్ప దేవాలయంలో 300 ఏళ్ల తర్వాత జలాభిషేకం

రామప్ప దేవాలయంలో 300 ఏళ్ల తర్వాత జలాభిషేకం

వార్త 3 weeks ago

Ramappa Temple : ములుగు జిల్లాలోని చారిత్రాత్మక యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద రామప్ప దేవాలయంలో శనివారం ఒక చారిత్రక నూతన అధ్యాయం ప్రారంభమైంది. దాదాపు 300 సంవత్సరాలుగా నిలిచిపోయిన పూర్తి స్థాయి నిత్య జలాభిషేకం కార్యక్రమాన్ని అధికారులు, అర్చకులు విజయవంతంగా పునరుద్ధరించారు.

17వ శతాబ్దంలో సంభవించిన తీవ్ర భూకంపం కారణంగా దేవాలయ గర్భగుడి నిర్మాణం కొద్దిగా దెబ్బతిని, అభిషేక జలాలు బయటకు వెళ్లే ‘సోమసూత్రం’ మార్గం పూర్తిగా మూసుకుపోయింది. గర్భగుడిలో నీరు నిలిచిపోతే కట్టడానికి ముప్పు వాటిల్లుతుందనే కారణంతో దశాబ్దాలుగా సంపూర్ణ జలాభిషేకాన్ని నిలిపివేశారు.

ఆధునిక సాంకేతికతతో అడ్డంకుల తొలగింపు: పురాతత్వ శాఖ ప్రతిభ

కాకతీయుల శిల్పకళా వైభవానికి ప్రతీకగా నిలిచిన ఈ కట్టడానికి ఎలాంటి హాని కలగకుండా సోమసూత్రం మార్గాన్ని పునరుద్ధరించడం అధికారులకు పెద్ద సవాలుగా మారింది. పురాతత్వ శాఖ నిపుణులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి, ప్రాచీన రాతి కట్టడం దెబ్బతినకుండా జాగ్రత్తగా అడ్డంకులను తొలగించారు. ఈ విజయవంతమైన సాంకేతిక ప్రక్రియతో గర్భగుడి నుంచి అభిషేక జలాలు సునాయాసంగా బయటకు వెళ్లే మార్గం సుగమమైంది. 3 శతాబ్దాల విరామం తర్వాత రామలింగేశ్వర స్వామికి మళ్లీ సంపూర్ణ జలాభిషేకం పునఃప్రారంభం కావడంతో భక్తులు, స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha