Dailyhunt
రామయంపేట్ నియోజకవర్గం ఏర్పాటు కోసం ఎంపీ కి వినతిపత్రం..

రామయంపేట్ నియోజకవర్గం ఏర్పాటు కోసం ఎంపీ కి వినతిపత్రం..

వార్త 2 weeks ago

ఎంపీ రఘునందన్ రావు సానుకూల స్పందన

Ramayampet Assembly Constituency: రామాయంపేట నియోజకవర్గo ఏర్పాటు కోసం స్థానిక నాయకులు మరో అడుగు వేశారు. రామాయంపేట మున్సిపల్ చైర్ పర్సన్ గజవాడ లావణ్య నాగరాజు ఆధ్వర్యంలో ఆదివారం నాడు ఎంపీ రఘునందన్ రావు ను కలిసి వినతి పత్రం సమర్పించారు.

సీనియర్ నాయకులు మైనంపల్లి హన్మంతరావు సూచలతో గౌరవ MLA రోహిత్ రావు అదేశాలమేరకు మెదక్ MP రఘునందన్ రావును మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందించడం జరిగిందని తెలిపారు.

Read Also:New Mega Bus Hub Hyderabad:హైదరాబాద్‌లో మూడో భారీ బస్ టెర్మినల్

Ramayampet Assembly Constituency: పాల్గొన్న నాయకులు

ఇందుకు ఎంపీ తనవంతు ప్రయత్నం శక్తివంచన లేకుండా కృషి చేస్తాను అని, ఖచ్చితంగా నియోజకవర్గం ఏర్పాటు జరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి అని అన్నారు. ఇట్టి కార్యక్రమంలో వైస్ చైర్ పర్సన్ పోచమ్మల నవనీత గణేష్, ఆయా వార్డు కౌన్సలర్లు గుగులోత్ రవి నాయక్, బైరామ్ స్వప్నకుమార్, దేవుని రంజిత్, డాకి శ్యామల స్వామి, కాంగ్రేస్ పార్టీ పట్టణ అధ్యక్షులు చింతల స్వామి, మెదక్ డిసిసి ఉపాధ్యక్షులు చింతలయాదగిరి,దేమే యాదగిరి తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

TGSRTCలో బాబూ జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha