Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రానున్న 2 గంటల్లో ఈ జిల్లాల్లో వర్ష సూచన!

రానున్న 2 గంటల్లో ఈ జిల్లాల్లో వర్ష సూచన!

వార్త 1 month ago

Telangana Weather Update: తెలంగాణ వ్యాప్తంగా ఎండలు తీవ్రస్థాయిలో దంచికొడుతున్నాయి. భానుడి భగభగలకు జనం అల్లాడుతుండగా, వాతావరణ శాఖ కొన్ని రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రానున్న కొన్ని గంటల్లో అకస్మాత్తుగా వాతావరణం మారి, వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.

ముఖ్యంగా అటవీ ప్రాంతాలు, సరిహద్దు జిల్లాల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉండనుంది.

భద్రాద్రి కొత్తగూడెం, వికారాబాద్, సంగారెడ్డి, ములుగు జిల్లాల్లో రానున్న 2 గంటల్లో వానలు కురిసే అవకాశం ఉంది. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షం పడవచ్చు. ఈ వర్షాల వల్ల ఎండ వేడి నుంచి ప్రజలకు తాత్కాలిక ఉపశమనం లభించనుంది.

Read Also: Mancherial Aqua Park: రూ.100 కోట్లతో భారీ ఇంటిగ్రేటెడ్ ఆక్వా పార్క్

 A Rain forecast in these districts in the next 2 hours!

Telangana Weather Update: హైదరాబాద్‌లో వాతావరణం ఎలా ఉందంటే?

జిల్లాల్లో వర్ష సూచన ఉన్నప్పటికీ, రాజధాని హైదరాబాద్‌లో మాత్రం భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. నగరంలో ప్రస్తుతానికి పొడి వాతావరణమే ఉంటుందని వాతావరణ నిపుణులు స్పష్టం చేశారు. ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉన్నా, వర్షం కురిసే అవకాశాలు తక్కువగానే ఉన్నాయి. దీనివల్ల నగరవాసులకు ఎండ వేడి నుండి పెద్దగా ఊరట లభించకపోవచ్చు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

మండిపోతున్న ఎండల మధ్య ఐఎండీ కూల్ అప్‌డేట్.. ఆ తేదీ నుంచి వర్షాలు షురూ!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha