Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రానున్న 2-3 గంటల్లో ఈ జిల్లాల్లో ఉరుములతో కూడిన భారీ వర్షాలు!

రానున్న 2-3 గంటల్లో ఈ జిల్లాల్లో ఉరుములతో కూడిన భారీ వర్షాలు!

వార్త 5 days ago

Telangana Rain Updates: తెలంగాణలోని పలు జిల్లాల ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం (IMD Hyderabad) తక్షణ హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రంలో వాతావరణం వేగంగా మారుతుండటంతో..

రానున్న రెండు నుంచి మూడు గంటల వ్యవధిలో పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన గాలివానలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ ‘ఎల్లో అలర్ట్’ (Yellow Alert) ప్రకటించింది. ఇప్పటికే రాష్ట్ర రాజధాని హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో ఆకాశం పూర్తిగా మేఘావృతమై, చల్లని గాలులు వీస్తూ ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంది. మరికొన్ని చోట్ల తేలికపాటి జల్లులు కూడా ప్రారంభమయ్యాయి.

Read Also:Rain Alert: హైదరాబాద్‌లో కురవనున్న భారీ వర్షాలు: ఎల్లో అలర్ట్ జారీ

ఎల్లో అలర్ట్ జారీ చేసిన జిల్లాలు ఇవే

ప్రధానంగా ఉత్తర మరియు పశ్చిమ తెలంగాణ పరిధిలోని కింది జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఎక్కువగా ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది:

  • ఆదిలాబాద్
  • కుమురంభీం ఆసిఫాబాద్
  • మంచిర్యాల
  • నిర్మల్
  • నిజామాబాద్
  • జగిత్యాల
  • రాజన్న సిరిసిల్ల
  • కామారెడ్డి
  • మెదక్
  • సంగారెడ్డి

Telangana Rain Updates: ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

ఈ జిల్లాల పరిధిలో వర్షం కురిసే సమయంలో పిడుగులు పడే ప్రమాదం కూడా ఉన్నందున ప్రజలు, ముఖ్యంగా రైతులు, గొర్రెల కాపరులు బయటకు రావద్దని అధికారులు సూచించారు. వర్షం పడుతున్నప్పుడు చెట్ల కింద, విద్యుత్ స్తంభాల వద్ద నిలబడకూడదని హెచ్చరించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు మరియు వాహనదారులు ప్రయాణాల సమయంలో అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ శాఖ సూచించింది.

Epaper: epaper.vaartha.com

నేడు తెలంగాణకు భారీ వర్ష సూచన.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha