Dailyhunt
రానున్న 3 గంటల్లో ఉరుములతో కూడిన వర్షాలు

రానున్న 3 గంటల్లో ఉరుములతో కూడిన వర్షాలు

వార్త 2 weeks ago

AP Weather Updates: ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం ఒక్కసారిగా మలుపు తిరిగింది. ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మేఘావృతమై, వర్ష సూచనలు కనిపిస్తున్నాయి.

ముఖ్యంగా కోస్తా ఆంధ్ర మరియు పరిసర ప్రాంతాల్లో వాతావరణం చల్లబడటమే కాకుండా, ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురిసేందుకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

Read Also: Onion Tomato Price Drop: గల్ఫ్ యుద్ధం దెబ్బ.. భారీగా పడిపోయిన ఉల్లి, టమాటా ధరలు!

 Heavy rains in AP the next 3 hours.

AP Weather Updates: ఈ ప్రాంతాల్లో హై అలర్ట్

ప్రస్తుత పరిస్థితులను గమనించిన అధికారులు పలు కీలక ప్రాంతాలకు హెచ్చరికలు జారీ చేశారు. విజయవాడ, నూజివీడు, భీమవరం, భీమడోలు, గుడివాడ, గన్నవరం తదితర ప్రాంతాల్లో వాతావరణం అత్యంత ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని తెలిపారు. ఈ ప్రాంతాల్లో రానున్న మూడు గంటల పాటు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ ‘రెడ్ అలర్ట్’ ప్రకటించారు.

గాలుల బీభత్సం.. ప్రజలకు కీలక సూచనలు

వర్షంతో పాటు గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అంచనా వేస్తోంది. ఈ క్రమంలో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలే ప్రమాదం ఉన్నందున ప్రజలెవరూ అనవసరంగా ఇళ్ల నుంచి బయటకు రావొద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు పెట్టుకోవద్దని స్పష్టం చేశారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

ఏపీలో గ్యాస్ సిలిండర్ల డెలివరీ వేగవంతం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha