Today Rasi Phalalu : రాశి ఫలాలు - 15 మే 2026
మేష రాశి
మేష రాశి వారికి ఈ రోజు భావోద్వేగాలను నియంత్రించుకోవడం చాలా అవసరం. చిన్న విషయానికే ఆవేశపడే అవకాశం ఉండటంతో కుటుంబ సభ్యులు, సహచరులతో మాట్లాడేటప్పుడు మాటల్లో జాగ్రత్త అవసరం.

వృషభ రాశి
వృషభ రాశి వారికి ఈ రోజు కుటుంబ సంబంధాలలో సానుకూల మార్పులు కనిపించే అవకాశం ఉంది. కొంతకాలంగా బంధువులతో కొనసాగుతున్న విభేదాలు, అపార్థాలు ఇప్పుడు పరిష్కార దశకు చేరుకుంటాయి. మీ మాటతీరు మరియు సహన స్వభావం వల్ల పరిస్థితులు క్రమంగా చక్కబడతాయి.

మిథున రాశి
మిథున రాశి వారికి ఈ రోజు కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఆసక్తి పెరుగుతుంది. నూతన విద్యలు, సాంకేతిక పరిజ్ఞానం లేదా మీకు ఉపయోగపడే కొత్త నైపుణ్యాలపై దృష్టి పెట్టే అవకాశం ఉంది. మీరు నేర్చుకునే ప్రతి విషయం భవిష్యత్తులో మంచి అవకాశాలకు మార్గం చూపుతుంది.

కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి ఈ రోజు బాధ్యతలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఉద్యోగం, కుటుంబం లేదా వ్యక్తిగత జీవితంలో మీపై నమ్మకం ఉంచి ముఖ్యమైన పనులను అప్పగించే అవకాశం ఉంది.విధి నిర్వహణలో క్రమశిక్షణతో వ్యవహరించడం వల్ల మీ ప్రతిష్ట మరింత పెరుగుతుంది.

సింహ రాశి
సింహ రాశి వారికి ఈ రోజు సాధారణ ఫలితాలు కనిపించే అవకాశం ఉంది. ముఖ్యంగా రాజకీయ, కళారంగాల్లో ఉన్నవారికి ఆశించిన స్థాయిలో గుర్తింపు లేదా అవకాశాలు వెంటనే లభించకపోవచ్చు. చేపట్టిన పనుల్లో కొంత ఆలస్యం లేదా నిరుత్సాహం ఎదురైనా, సహనంతో ముందుకు సాగడం మంచిది.

కన్యా రాశి
కన్య రాశి వారికి ఈ రోజు అనేక విధాలుగా అనుకూల ఫలితాలు కనిపించే అవకాశం ఉంది. మీరు చాలాకాలంగా ఎదురుచూస్తున్న కొన్ని పనులు సానుకూల దిశగా సాగుతాయి. మనసులో ఉన్న ఆశలు, ఆకాంక్షలు ఒక్కొక్కటిగా నెరవేరుతున్నట్లుగా అనిపిస్తుంది.

తులా రాశి
తుల రాశి వారికి ఈ రోజు కుటుంబ బాధ్యతలు ముఖ్యంగా మారే అవకాశం ఉంది. ఇంటి విషయాల్లో మీరు తీసుకునే నిర్ణయాలు అందరినీ ఆకట్టుకుంటాయి. కుటుంబ సభ్యుల అవసరాలను అర్థం చేసుకుని సక్రమంగా బాధ్యతలు నిర్వహించడం వల్ల మీపై గౌరవం పెరుగుతుంది.

వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి ఈ రోజు కొంతకాలంగా నిలిచిపోయిన విషయాల్లో పురోగతి కనిపించే అవకాశం ఉంది. ముఖ్యంగా కోర్టు కేసులు లేదా న్యాయపరమైన వ్యవహారాలు ఓ కొలిక్కి వచ్చే సూచనలు ఉన్నాయి. ఇప్పటివరకు ఉన్న అనిశ్చితి క్రమంగా తగ్గి, సమస్యలకు పరిష్కార మార్గాలు కనిపించవచ్చు.

ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వారికి ఈ రోజు కొత్త ఆలోచనలు, కొత్త ప్రారంభాలకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. మీరు చేపట్టే నూతన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఎంతోకాలంగా ఆలోచిస్తున్న పనులను కార్యరూపంలోకి తీసుకురావడానికి ఇది మంచి సమయం.

మకర రాశి
మకర రాశి వారికి ఈ రోజు మాటల్లో జాగ్రత్త అవసరమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. తొందరపాటుగా మాట్లాడటం లేదా ఆవేశంలో స్పందించడం వల్ల సన్నిహితులతో అపార్థాలు ఏర్పడే అవకాశం ఉంది. ముఖ్యంగా కుటుంబ సభ్యులు, స్నేహితులతో వ్యవహరించేటప్పుడు మృదువైన మాటతీరు పాటించడం మంచిది.

కుంభ రాశి
కుంభ రాశి వారికి ఈ రోజు గృహ సంబంధిత వ్యవహారాలు సానుకూలంగా సాగుతాయి. ఇంటి పనులు, కుటుంబ బాధ్యతలు లేదా ఆస్తికి సంబంధించిన విషయాలు సాఫీగా పూర్తయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యుల సహకారం వల్ల మీరు అనుకున్న పనులను సమయానికి పూర్తి చేయగలుగుతారు.

మీన రాశి
మీన రాశి వారికి ఈ రోజు పట్టుదల, ఆత్మవిశ్వాసం ప్రధాన బలాలుగా నిలుస్తాయి. మీరు చేపట్టిన పనులను మధ్యలో వదిలేయకుండా క్రమంగా ముందుకు సాగడం వల్ల విజయవంతంగా పూర్తి చేసే అవకాశం ఉంది.

వారం – వర్జ్యం
తేది : 15-05-2026, శుక్రవారం
శ్రీ పరాభవ నామ సంవత్సరం, చైత్రమాసం , ఉత్తరాయణం వసంత ఋతువు, కృష్ణపక్షం, కృత్తిక కార్తె
త్రయోదశి ఉ.8.31, చతుర్దశి తె.5.11, అశ్వని రా.8.10
వర్జ్యం: సా.4.34-సా. 6.00, తె.4.41 – ఉ.6.07
దు.మూ ఉ. 8. 11- ఉ.9.03 , మ. 12.29 – రా. 1.21 –
శుభ సమయం:ఉ.6.30-7.30
రాహుకాలం:ఉ.10.30-12.00

రాశి ఫలాలు

