Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రాశి ఫలాలు - 23 మే 2026

రాశి ఫలాలు - 23 మే 2026

వార్త 2 days ago

Today Rasi Phalalu : రాశి ఫలాలు - 23 మే 2026

 మేష రాశి

పోటీ పరీక్షలు, విదేశీయానం, ఉద్యోగ అవకాశాలకు సంబంధించిన విషయాలు కుటుంబానికి ఆనందాన్ని కలిగిస్తాయి.

మీ ప్రతిభకు గుర్తింపు లభించే సూచనలు కనిపిస్తున్నాయి. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే అనుకున్న పనుల్లో విజయాలు సాధించే అవకాశం ఉంది.


వృషభ రాశి

సంతాన పురోగతి మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. వారి విద్య, ఉద్యోగం లేదా వ్యక్తిగత అభివృద్ధికి సంబంధించిన విషయాల్లో శుభవార్తలు వినే అవకాశం ఉంది. మీరు చేసిన కష్టానికి కుటుంబ సభ్యుల నుంచి గౌరవం లభిస్తుంది.


మిథున రాశి

కొన్ని ముఖ్యమైన విషయాల్లో హడావుడిగా నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది. అయితే మీ అనుభవం, చాకచక్యం సరైన దిశలో ముందుకు నడిపిస్తాయి. వృత్తి, ఉద్యోగ రంగాలలో వేగంగా స్పందించడం వల్ల అనుకూల ఫలితాలు దక్కే సూచనలు కనిపిస్తున్నాయి.


కర్కాటక రాశి

శుభకార్యాలకు సంబంధించిన విషయాల్లో మీరు తీసుకునే నిర్ణయాలు కుటుంబంలో, బంధువుల మధ్య చర్చనీయాంశంగా మారే అవకాశం ఉంది. మీ ఆలోచనలకు పెద్దల మద్దతు లభిస్తుంది. ఇంట్లో ఆనందకరమైన వాతావరణం నెలకొని అందరిలో ఉత్సాహం పెరుగుతుంది.


సింహ రాశి

ముఖ్యమైన ప్రయాణాలకు సంబంధించిన ప్రణాళికలను ఈ రోజు మీరు స్వయంగా వాయిదా వేసే అవకాశం ఉంది. కొన్ని పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం వల్ల తొందరపాటు నిర్ణయాలను తప్పించుకోవాలని భావిస్తారు. అయితే ఈ నిర్ణయం భవిష్యత్తులో మీకు మేలు చేసే సూచనలు కనిపిస్తున్నాయి.


కన్యా రాశి

భాగస్వాములు లేదా సహచరులు తీసుకునే తెలివితక్కువ నిర్ణయాల వల్ల కొన్ని మంచి అవకాశాలు మీ చేతుల నుంచి జారిపోయే పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది. మీరు ఎంతో ఆశించిన పనులు ఇతరులకు దక్కడం కొంత అసంతృప్తిని కలిగించవచ్చు.


తులా రాశి

ప్రతి విషయంలోనూ ఈ రోజు మీరు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని నిర్ణయించుకుంటారు. చిన్న విషయాన్నికూడా నిర్లక్ష్యం చేయకుండా ముందుగానే ఆలోచించి అడుగులు వేయడం వల్ల సమస్యలను దూరంగా ఉంచగలుగుతారు. కుటుంబ వ్యవహారాల్లో మీ బాధ్యతాయుతమైన తీరు అందరినీ ఆకట్టుకుంటుంది.


వృశ్చిక రాశి

పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తులైనా ఈ రోజు చిన్న చిన్న పనులను స్వయంగా చూసుకోవాల్సిన పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది. బాధ్యతలు పెరగడం వల్ల ప్రతి విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించాల్సి వస్తుంది. అయితే ఈ అనుభవం మీకు కొత్త అవగాహనను తీసుకువస్తుంది.


ధనుస్సు రాశి

పెట్టుబడులు, అభివృద్ధికి సంబంధించిన విషయాల్లో ఈ రోజు మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో మంచి ఫలితాలను అందించే అవకాశముంది. దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని చేసే ఖర్చులు మీకు ఉపయోగపడతాయి.


మకర రాశి

మీరు సాధించిన అభివృద్ధి లేదా చేసిన కృషి గురించి మీరు స్వయంగా చెప్పకపోతే కార్యాలయంలోని వారికి పూర్తిగా తెలియని పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది. మీ ప్రతిభను సరైన సమయంలో ప్రదర్శించడం వల్ల ఉన్నతాధికారుల ప్రశంసలు పొందగలుగుతారు.


కుంభ రాశి

కొంత మంది విదేశీ ద్రవ్యాన్ని విశేషంగా ఆర్జించే అవకాశాలు కనిపిస్తున్నాయి. విదేశాలకు సంబంధించిన ఉద్యోగాలు, వ్యాపారాలు లేదా ఆన్‌లైన్ వ్యవహారాల ద్వారా ఆర్థిక లాభాలు పొందే సూచనలు ఉన్నాయి. గతంలో చేసిన కృషికి ఇప్పుడు ఫలితాలు కనిపించడం ప్రారంభమవుతుంది.


మీన రాశి

గృహాలంకరణలకు సంబంధించిన విషయాల్లో ఈ రోజు మీరు ప్రత్యేక ఆసక్తి చూపించే అవకాశం ఉంది. ఇంటి అందాన్ని పెంచేందుకు కొత్త వస్తువులు కొనుగోలు చేయడం లేదా మార్పులు చేయాలని ఆలోచిస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి ఇంటి వాతావరణాన్ని మరింత ఆనందంగా మార్చేందుకు ప్రయత్నిస్తారు.


వారం – వర్జ్యం

తేది : 23-05-2026, శనివారం

శ్రీ పరాభవ నామ సంవత్సరం, అధిక జ్యేష్ఠమాసం , ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు, శుక్లపక్షం , రోహిణి కార్తె

అష్టమి తె.4.28, మఖ రా.2.11

వర్జ్యం:మ.2.11-మ. 3.47

దు.మూతె.5.34- ఉ.7.14

రాహుకాలం:ఉ .9.00-10.30

రాశి ఫలాలు

మేష రాశి వృషభ రాశి మిథున రాశి కర్కాటక రాశి సింహ రాశి కన్య రాశి తుల రాశి వృశ్చిక రాశి ధనుస్సు రాశి మకరం రాశి కుంభ రాశి మీన రాశి
Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha