Chandrababu Gudur Speech | గూడూరు, జూలై 1 : రాష్ట్రాభివృద్ధితో పాటు తెలుగువారిని అందలం ఎక్కించటమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పాలన అందిస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
రాష్ట్రంలో ప్రజాభీష్టం మేరకే సుపరిపాలన అందిస్తున్నామని వివరించారు. ప్రజల జీవితాల్లో శాశ్వతంగా వెలుగులు నింపే ప్రయత్నం చేస్తున్నామని వివరించారు. నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గం పున్నపువారిపాలెంలో బుధవారం పేదల సేవలో కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. ప్రజా వేదిక సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ….''ప్రజలు చూపిస్తూన్న అభిమానంతో పడుతున్న కష్టాన్ని మర్చిపోతున్నాం. గత పాలకులు నెల్లూరు జిల్లాను అశాస్త్రీయంగా విభజించారు. గూడూరును తిరిగి నెల్లూరు జిల్లాలో కలుపుతామని హామీ ఇచ్చి నెరవేర్చాం. సైదాపురం, కలవాయి మండలాలను కూడా నెల్లూరు జిల్లాలో కలిపాం. ప్రజల అభీష్టం ప్రకారమే పరిపాలన జరగాలి. పెత్తందారీ వ్యవస్థకు చోటు లేదు. అందుకే రాష్ట్రవ్యాప్తంగా ఆశాస్త్రీయంగా జరిగినల్లాల విభజనను సవరించాం. ప్రజల జీవితాల్లో శాశ్వతంగా వెలుగు నింపాలనే లక్ష్యంతోనే పనిచేస్తున్నాం. సామాజిక బాధ్యతగానే ప్రతీ నెలా 1వ తేదీన కనీస అవసరాలు తీర్చుకోలేని ఆపన్నులకు పెన్షన్ అందిస్తున్నాం. వృద్ధాప్య, వితంతు, దివ్యాంగులు సహా 28 కేటగిరీల లబ్దిదారులకు పెన్షన్లు అందిస్తూ వారిని ఆదుకుంటున్నాం. పేదల జీవన ప్రమాణాలను పెంచాలనే లక్ష్యంతో పీ4 కార్యక్రమాన్ని కూడా అమలు చేస్తున్నాం. ఇప్పటి వరకూ రూ.68,598 కోట్ల మేర పెన్షన్ల కింద కూటమి ప్రభుత్వం పంపిణీ చేసింది. ప్రతీ నెలా 62.20 లక్షల మందికి రూ.2,712 కోట్లు పెన్షన్లకు చెల్లిస్తున్నాం.' అని సీఎం అన్నారు.
పొదుపు ఉద్యమానికి డ్వాక్రా మహిళలే దిక్సూచి
గడిచిన రెండేళ్ల ప్రయాణంలో రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయటంతో పాటు వ్యవస్థలను గాడిలో పెట్టామని, సంక్షోభాలు, సమస్యలను దాటుకుని ప్రజలకు మేలు చేసేలా అనునిత్యం పనిచేస్తున్నామని అన్నారు. 'గత పాలకులు ఐదేళ్ల పాటు విధ్వంసం చేశారు… రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. రెండేళ్ల లోనే అన్ని పనులూ చేసేశామని మేం చెప్పటం లేదు. కానీ శుభారంభం చేశాం. గత అవినీతి పాలనను మార్చి రాష్ట్రంలో మళ్లీ సుపరిపాలన తీసుకువచ్చాం. మనమిత్ర వాట్సప్ గవర్నెన్సు ద్వారా ఆన్‌లైన్‌లో సేవలను అందిస్తూ ప్రజల చేతిలోకి పౌర సేవలను తీసుకువచ్చాం. కేంద్ర ప్రభుత్వ సహకారంతో సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజలకు అందించగలుగుతున్నాం. తల్లికి వందనం, స్త్రీశక్తి, దివ్యాంగ శక్తి, మత్స్యకారుల సేవలో, ఆటో డ్రైవర్ల సేవలో లాంటి వివిధ పథకాలను అమలు చేశాం. పేదల జీవన ప్రమాణాలు పెంచి వారికి అండగా నిలవాలనేది కూటమి ప్రజా ప్రభుత్వ లక్ష్యం. సంపన్నులైన 10 శాతం మంది అట్టడుగు స్థాయిలో ఉన్న 20 శాతం మంది పేదలను ఆదుకునేలా పీ4 కార్యక్రమం చేపట్టాం. ఆర్ధిక అసమానతలు తొలగించి మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించేందుకు నా జీవితాన్ని అంకితం చేశాను. లక్ష మందికి పైగా మార్గదర్శులు, 10 లక్షలకు మందికి పైగా బంగారు కుటుంబాలను దత్తత తీసుకుని అన్ని విధాలా సహకారం అందిస్తున్నారు. మహిళలను పారిశ్రామిక, వ్యాపార వేత్తలుగా తయారు చేసేందుకు వన్ ఫ్యామిలీ వన్ ఎంట్రప్రెన్యూర్ కార్యక్రమం చేపట్టాం. పొదుపు ఉద్యమంలో మన డ్వాక్రా మహిళలు దేశానికే ఆదర్శంగా నిలిచారు. అందుకే బ్యాంకులు కూడా డ్వాక్రా మహిళలకు పెద్ద ఎత్తున రుణాలు అందించేందుకు ముందుకు వస్తున్నాయి'' అని ముఖ్యమంత్రి అన్నారు.
Chandrababu Gudur Speech: రాష్ట్రంలోనే అగ్రగామిగా నెల్లూరు జిల్లా
'రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలూ సమానంగా అభివృద్ధి చెందాలన్నదే మా ఆకాంక్ష. విశాఖ, అమరావతి, తిరుపతి కేంద్రంగా మూడు రీజియన్లుగా చేసి అభివృద్ధి ప్రణాళికలు అమలు చేస్తున్నాం. అభివృద్దిలో సంపద సృష్టిలో నెల్లూరు జిల్లా దేశంలోనే అగ్రగామి జిల్లాగా మారుతుంది. రామాయపట్నం పోర్టు, కృష్ణపట్నం పోర్టు, దుగరాజపట్నంలో షిప్ బిల్డింగ్ సెంటర్ వస్తున్నాయి. రామాయపట్నం వద్ద బీపీసీఎల్ లక్ష కోట్లతో రిఫైనరీ పెడుతోంది. ఇఫ్కో కిసాన్ సెజ్ లో కూడా పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తున్నాయి. ఇప్పటికే గూడూరు ప్రాంతంలో 27 మెగా పరిశ్రమలు వచ్చాయి. మెగా ఫర్నిచర్ పార్కు కూడా ఏర్పాటు కాబోతోంది. మన రాష్ట్రంలోనే ఉన్న శ్రీసిటీ దేశ పారిశ్రామిక ప్రాంతాలకు ఆదర్శం. గత పాలకుల వల్ల రాష్ట్రం నుంచి పెట్టుబడులు పారిపోయాయి. ఇప్పుడు కూటమిపై నమ్మకంతో పెట్టుబడి దారులు తిరిగి వస్తున్నారు. జాతీయ రహదారి కారిడార్లు, 4 లేన్ రైల్వే ట్రాక్ కూడా మన ప్రాంతం నుంచి వెళ్లేలా ప్రాజెక్టులు వస్తున్నాయి. అన్ని పోర్టులకూ రైల్వే లైన్లను అనుసంధానించి ఈ ప్రాంతాన్ని లాజిస్టిక్స్ కేంద్రంగా తయారు చేస్తాం' అని సీఎం చంద్రబాబు అన్నారు.
నీటి భద్రతపై నిరంతరం శ్రద్ధ
'సాగునీటికి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. 36 ప్రాజెక్టులు ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేసేలా కేలండర్ విడుదల చేశాం. ఇప్పటికే సాగునీటి ప్రాజెక్టుల కోసం రూ.24 వేల కోట్లు ఖర్చు చేశాం. ఈ ప్రాంతానికి అత్యంత కీలకమైన వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేసి నీళ్లు ఇస్తాం. ఇంకా రూ.4 వేల కోట్ల పనులు పెండింగ్ ఉండగానే గత పాలకుడు ప్రాజెక్టును ప్రారంభించి జాతికి అంకితం చేశారు. డ్రామాల రాయుడికి నాటకాలు అడటమే పని. రూ.900 కోట్లు పునరావాసానికి నిధులు విడుదల చేస్తున్నాం. ఇప్పటికే నిర్వాసితులకు రూ.300 కోట్లు చెల్లింపులు చేశాం. త్వరలోనే మిగతా మొత్తాన్ని కూడా చెల్లిస్తాం. రూ.2,500 కోట్లతో వెలిగొండ మొదటి దశను పూర్తి చేసి ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు, కడప తదితర జిల్లాలకు నీళ్లిస్తాం. ఎల్ నినో ప్రభావం ప్రపంచ దేశాలపై తీవ్రంగా ఉంది. వర్షాలు బాగా తగ్గాయి. గత ఏడాది పడిన వర్షాలకు గోదావరి, కృష్ణానదులు పొంగి పొర్లాయి. ఆ సమయంలోనే రిజర్వాయర్‌లను నింపాం. ఈ ఏడాది ఇప్పటికీ నదుల్లో ప్రవాహాలు రాలేదు. అయినా ప్రాజెక్టుల్లో 65 శాతం మేర నిల్వలు ఉన్నాయి. అందుకే భూమినే జలాశయంగా మార్చుకునేలా జల ధార లాంటి కార్యక్రమాలు చేపట్టాం. నదుల అనుసంధానం చేసేలా ప్రణాళికలు కూడా చేపట్టాలని ఆలోచన చేస్తున్నాం. గోదావరి-కావేరి నదుల అనుసంధానం చేస్తే దిగువ రాష్ట్రాలకూ నీరు ఇచ్చే పరిస్థితి ఉంటుంది' అని సీఎం అన్నారు.
Chandrababu Gudur Speech : తీవ్రవాదుల తరహాలో ప్రజల్ని భయపెడుతున్నారు
'పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో పెట్రోలు, డీజిల్ ధరలు కూడా పెరిగాయి. ఈ సమయంలోనే ఇథనాల్ వినియోగించుకుని ఇంధన పొదుపు చేయాల్సి ఉంది. ఇథనాల్ తయారీ కోసం మొక్కజొన్న లాంటి పంటలు అవసరం అవుతాయి. రైతులు ఈ ప్రత్యామ్నాయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. పరిశ్రమల్ని ఆహ్వానించడానికి సమయం పడుతుంది. కానీ తరిమి కొట్టడానికి ఒక్క క్షణం చాలు. గత పాలకులు పరిశ్రమల్ని రాష్ట్రం నుంచి తరిమి కొట్టారు. కర్ణాటకకు వెళ్లిపోవాల్సిన హీరో మోటార్స్ సంస్థను రాష్ట్రానికి తీసుకువచ్చి ఇక్కడ మోటార్ సైకిళ్లు ఉత్పత్తి చేసేలా కృషి చేశాం. కడపలో రాయలసీమ స్టీల్ ప్లాంట్‌కు కూడా 3వ తేదీన శంకుస్థాపన చేయబోతున్నాం. 2028 నాటికి ఆ రాయలసీమలో స్టీల్ పరిశ్రమ ఉత్పత్తి కూడా ప్రారంభిస్తుంది. నా ప్రయత్నం అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన అందించటమే. గొడ్డలి పార్టీ తీవ్రవాదుల తరహాలో అందరినీ భయాందోళనలకు గురి చేస్తోంది. రోజుకో ఫేక్ న్యూస్, రోజుకో విన్యాసంతో గొడ్డలి పార్టీ కుల, మత, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తోంది. గొడ్డలి పార్టీ రాష్ట్రాన్ని గంజాయికి అడ్డాగా మార్చింది. మేం అధికారంలోకి వచ్చాక ఈగల్ టాస్క్ ఫోర్సు ద్వారా నియంత్రించాం. గత పాలకులు ప్రజల్ని బంధించి, భయపెట్టి మరీ సమావేశాలు పెట్టారు. కూటమి అధికారంలోకి వచ్చాకే ప్రజలకు స్వేచ్ఛ వచ్చింది. రాష్ట్ర ప్రజలందరికీ అవసరమైన రాజధాని అమరావతి గొడ్డలి పార్టీకి అవసరం లేదు. అందుకే ఇంకా రాజధానిపై కుట్రలను కొనసాగిస్తూనే ఉన్నారు. ఇప్పుడు వేగంగా పనులు జరుగుతుంటే సహించలేకపోతున్నారు. గత పాలకుడు తీసుకున్న అస్తవ్యస్త నిర్ణయాలతో రాష్ట్రానికి రాజధానే లేకుండా పోయింది. మూడు రాజధానుల పేరిట గందరగోళ పరిచారు. ఎవరైనా పొరుగు రాష్ట్రాలకు వెళ్తే ఏపీకి మూడు రాజధానులా అని హేళనకు గురయ్యారు. పార్లమెంటులో శాశ్వత రాజధాని చట్టం చేస్తుంటే మావిగన్ అంటూ కొత్త ఆటలు మొదలు పెట్టారు. అమరావతి పరిరక్షణ కోసం అంటూ రౌడీలతో ఇప్పుడు దండయాత్ర చేస్తున్నారు. నిలకడలేని వ్యక్తులు రాజకీయ పార్టీ పెట్టి ప్రజల్ని ఇబ్బందులు పెడుతున్నారు.
హోంమంత్రిపై అవమానర వ్యాఖ్యలు
'విజయవాడలో యువకుడి అదృశ్యం ఘటన నా దృష్టికి వస్తూనే సీఐను సస్పెండ్ చేశాం, చర్యలకు ఆదేశించాం. కానీ వైసీపీ నాయకులు కులాల మధ్య వివాదాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కుటుంబ సభ్యులపై సామాజిక మాధ్యమాల్లో అసభ్య పోస్టులతో విష ప్రచారం చేస్తున్నారు. గంజాయి, బ్లేడ్ బ్యాచ్ లతో ఆ పార్టీ నేతలు రెచ్చి పోతున్నారు. హోం మంత్రి అనిత మేకప్ పై ఆ పార్టీ నేతలు అసహ్యంగా, అవమానకరంగా మాట్లాడారు. మహిళా కమిషన్ ఈ అంశంపై గట్టిగా ప్రశ్నించినా ఆ పార్టీ నేతలు తమ వ్యాఖ్యల్ని సమర్థించుకుంటున్నారు. జగన్ సహకారం లేకపోతే ఆయన వెంట ఉన్న నేతలు విచ్చలవిడిగా మాట్లాడే పరిస్థితి ఉండదు. మా పార్టీలో ఈ తరహా మాట్లాడిన వారిని పార్టీ నుంచి బయటకు పంపించాం. మేం యజ్ఞంలా అభివృద్ధి చేస్తుంటే వైసీపీ నేతలు రాక్షసుల్లా దానికి ఆటంకం కలిగిస్తున్నారు. నేరాలు చేసే పార్టీ, నేరస్తులను కాపాడే పార్టీ, నేరస్తులతో రాజకీయాలు చేసే పార్టీని ఇప్పుడే చూస్తున్నాం. అర్హత లేని వారిని అందలం ఎక్కిస్తే రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు సమస్యలు వస్తాయి. ఇలాంటి వ్యక్తులను జైల్లో పెట్టాలంటే ఒక్క నిముషం పని కానీ మేం ప్రతీ కార రాజకీయాలు చేయటం లేదు. మా దృష్టి అంతా రాష్ట్రం అభివృద్ధి కావాలని, తెలుగు వారిని అందలం
Epaper: epaper.vaartha.com

