Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రాష్ట్రంలో అంగన్‌వాడీ పోస్టుల భర్తీ.. పూర్తి వివరాలు, అర్హతలు ఇవే!

రాష్ట్రంలో అంగన్‌వాడీ పోస్టుల భర్తీ.. పూర్తి వివరాలు, అర్హతలు ఇవే!

వార్త 3 weeks ago

Telangana Anganwadi Recruitment 2026: తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగార్థులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. రాష్ట్రవ్యాప్తంగా అంగన్‌వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న 15,982 పోస్టులను సెప్టెంబర్‌ నెలాఖరు నాటికి భర్తీ చేయాలని అధికారులను ఆదేశించింది.

చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు అందించే సేవల్లో ఎటువంటి అంతరాయం కలగకుండా ఉండాలనే లక్ష్యంతో ఈ ప్రక్రియను జిల్లా స్థాయిలో వేగవంతం చేయనున్నారు.

Read Also : Ponnam Prabhakar : మంత్రి పొన్నం ప్రభాకర్‌కు SIR నోటీసులు.. తండ్రి పేరు సవరణకు పత్రాలు

Telangana Anganwadi Recruitment 2026: ఉద్యోగాల వివరాలు, జోన్లవారీ ఖాళీలు

మొత్తం భర్తీ చేయనున్న 15,982 పోస్టులలో 3,100 అంగన్‌వాడీ టీచర్‌ పోస్టులు, 12,882 అంగన్‌వాడీ హెల్పర్‌ పోస్టులు ఉన్నాయి. రాష్ట్రంలోని రెండు జోన్ల పరిధిలో ఈ నియామకాలు జరగనున్నాయి.

  • జోన్‌-1: మొత్తం 9,590 ఖాళీలు ఉన్నాయి. ఇందులో 1,853 టీచర్‌ పోస్టులు, 7,737 హెల్పర్‌ పోస్టులు ఉన్నాయి.
  • జోన్‌-2: మొత్తం 6,392 ఖాళీలు ఉన్నాయి. ఇందులో 1,247 టీచర్‌ పోస్టులు, 5,145 హెల్పర్‌ పోస్టులు ఉన్నాయి.

విద్యా అర్హత, ఎంపిక విధానం

ఈ ఉద్యోగాలకు ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు అర్హులు. ఎంపిక ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా, ఇంటర్మీడియట్‌లో సాధించిన మార్కులు, ఇంటర్వ్యూ ఆధారంగా కొనసాగుతుంది.

  • ఇంటర్మీడియట్ మార్కుల వెయిటేజీ: 70 శాతం
  • ఇంటర్వ్యూ వెయిటేజీ: 10 శాతం

ప్రత్యేక కేటగిరీల అభ్యర్థులకు వెయిటేజీ

సామాజిక భద్రత, సమాన అవకాశాలు కల్పించే దిశగా ప్రత్యేక కేటగిరీల అభ్యర్థులకు ప్రభుత్వం వెయిటేజీని ఖరారు చేసింది.

  • అనాథలకు: 10 శాతం వెయిటేజీ
  • వితంతువులకు: 5 శాతం వెయిటేజీ
  • దివ్యాంగులకు: 5 శాతం వెయిటేజీ

జిల్లా స్థాయిలోనే ఈ నియామక ప్రక్రియ ముగియనుండగా, ఇప్పటికే కొన్ని జిల్లాల్లో నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. మిగిలిన జిల్లాల్లో కూడా త్వరలోనే నియామక ప్రక్రియను ప్రారంభించనున్నారు.

ఇళ్ల విక్రయాల్లో ముంబైతో పోటీ పడుతున్న హైదరాబాద్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha